టెలివిజన్ ప్రీమియర్ గా సీతారామం… టెలికాస్ట్ ఎప్పుడంటే?
TeluguStop.com
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ పూర్తిస్థాయి తెలుగు చిత్రం సీతారామం సినిమాలో నటించిన ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ విడుదల అయ్యి థియేటర్లలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఒక అద్భుతమైన ప్రేమ కథ కావ్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటి మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు.
ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో నటుడు దుల్కర్ సల్మాన్ కు తెలుగులో ఎన్నో అవకాశాలు వస్తున్నాయి.
ఇక ఇందులోని పాటలు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఈ సినిమాతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారని చెప్పాలి.
ఇలా థియేటర్లో సుమారు 80 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.
"""/"/
థియేటర్ రన్ పూర్తి అయిన అనంతరం ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఓటీటీలో కూడా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పాలి.ఈ విధంగా థియేటర్లోనూ డిజిటల్ మీడియాలోనూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న సీతారామం సినిమా త్వరలోనే టెలివిజన్ ప్రీమియర్ కానుందని తెలుస్తుంది.
ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా కైవసం చేసుకున్నారు త్వరలోనే ఈ సినిమాని స్టార్ మా లో ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
త్వరలోనే టెలికాస్ట్ తేదీ కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
గూస్ బాంబ్స్ పక్కా.. దేశం కోసం సైన్యం ఎలా కష్టపుడుతుందో చూసారా ఎప్పుడైనా?