Dulquer Salmaan : ఆ కారణంతో సినిమాల్లోకి రావడానికి భయపడ్డాను.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్?
TeluguStop.com
దుల్కర్ సల్మాన్.ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయమం అక్కర్లేదు.
మమ్ముట్టి తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.
ముఖ్యంగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన మహానటి సినిమా( Mahanati )తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు.
అనంతరం సీతారామం సినిమాతో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు దుల్కర్ సల్మాన్.
ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ క్రేజ్ మరింత పెరిగింది.కాగా దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
"""/" /
దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) తాజాగా నటించిన వెబ్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్.
( Guns And GulaabS ) ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నారు.
ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 18 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్ సల్మాన్, ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.
ఇండస్ట్రీలో నాకు ఇష్టమైన నటులు చాలా మంది ఉన్నారు.ఏదైన సన్నివేశాన్ని చూస్తుంటే నాకు నచ్చిన నటుడు ఇందులో ఉంటే ఇంకా బాగుండేదని అనిపిస్తుంది.
ప్రేక్షకులంతా నాలాగే ఆలోచిస్తారని నా అభిప్రాయం.అలాగే సినిమాల్లోకి రావడానికి నేను చాలా ఆలోచించాను.
"""/" /
ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారా? స్క్రీన్‌పై నన్ను చూడడానికి వాళ్లు ఇష్టపడతారా? ఇలా ఎన్నో సందేహాలు నన్ను వెంటాడాయి.
నటీనటులు వారి సినిమాలను కొన్నేళ్ల తర్వాత చూసుకుంటే వాళ్లకూ మార్పులు కనిపిస్తాయి.నా కెరీర్ తొలినాళ్లలో నటించిన సినిమాలను ఇప్పుడు చూస్తే నాకు సంతృప్తిగా అనిపించదు.
ఇంకా బాగా చేసి ఉండాల్సింది అనుకుంటాను.మా నాన్న సినిమాలు చూసి ఎంతో నేర్చుకున్నాను.
ఆయనలాగా ఎదగాలని నేను భావిస్తున్నాను అని దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చారు.
ఏలకులతో అదిరే బ్యూటీ బెనిఫిట్స్.. డోంట్ మిస్..!