ఇది డబ్బింగ్ సినిమా కాదు బాబోయ్.. సీతరామం కు వింత కష్టం
TeluguStop.com
దుల్కర్ సల్మాన్ తెలుగు నటుడు కాదు.ఆయన మలయాళం లో స్టార్ నటుడు అనే విషయం అందరికి తెలిసిందే.
ఇక మృణాల్ ఠాకూర్ కూడా తెలుగు నటి కాదు, ఆమె మొదటి సారి తెలుగు లో నటిస్తుంది.
ఈ కారణాల వల్ల రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సీతారామం అనే సినిమా ను తెలుగు సినిమా కాదు.
ఇది ఒక డబ్బింగ్ సినిమా అని చాలా మంది భావిస్తున్నారు.తెలుగు సినిమా కాకున్నా కూడా తెలుగు లో డబ్బింగ్ చేసి భారీ ఎత్తున విడుదల చేస్తున్నారని ఎక్కువ శాతం మంది అనుకుంటున్నారు.
కానీ అసలు విషయం ఏంటంటే ఇది తెలుగు సినిమా.అతి తక్కువ మంది తెలుగు నటీనటులు ఈ సినిమా లో ఉన్నారు.
ముఖ్య పాత్రల్లో నటించిన వారిలో ఇతర భాషల ప్రముఖ స్టార్స్ ఉన్నారు కనుక ఈ సినిమా తెలుగు సినిమా కాకపోయి ఉంటుంది అని కొందరు అనుకోవడం సహజమే.
కానీ ఈ సినిమా కు దర్శకత్వం వహించింది తెలుగు దర్శకుడు అయిన హను రాఘవపూడి కాగా, నిర్మించింది మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్.
వీరిద్దరు తెర వెనుక ఉండడం వల్ల కనిపించే వారి కారణంగా ఈ సినిమా తెలుగు సినిమా కాదు అనే అభిప్రాయానికి కొందరు వచ్చారు.
కానీ తాజాగా ఈ సినిమా తెలుగు సినిమా అని ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇది ఒక డబ్బింగ్ సినిమా అని భావించే వారి కోసం అన్నట్లుగా ఈ సినిమా ప్రమోషన్ లో సినిమా నిర్మాత అశ్వినీ దత్ మరియు దర్శకుడు హను రాఘవపూడి ఎక్కువగా పాల్గొంటున్నారు.
అంతే కాకుండా బిత్తిరి సత్తి తో కూడా తాజా ఇంటర్వ్యూ లో ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమం లో ఈ సినిమా డబ్బింగ్ సినిమా కాదు బాబోయ్ అన్నట్లుగా చెప్పించే ప్రయత్నం చేశారు.
మొత్తానికి ఈ సినిమా విభిన్నమైన అనుభవం ని ఎదుర్కొంటుంది.మరోవైపు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా ఈ సినిమా కి పోటీగా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
ఆ ఆరోగ్య సమస్య వల్ల బెయిల్ ఇవ్వాలంటున్న మోహన్ బాబు.. అసలేం జరిగిందంటే?