పుష్ప సినిమాకు ఇది కాపీ కాదు… దానిని కాంప్లిమెంట్ అని భావిస్తాను: దుల్కర్ సల్మాన్
TeluguStop.com
మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్( Dulquer Salman ) త్వరలోనే కింగ్ ఆఫ్ కొత్త ( King Of Kotha ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ సినిమా ఈ నెల 24వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ఇలా ఈ సినిమా ఐదు భాషలలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో ఐశ్వర్యలక్ష్మి,( Aishwarya Lakshmi ) ప్రసన్న కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా దుల్కర్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. """/" /
ఈ మీడియా సమావేశంలో భాగంగా ఈయన మాట్లాడుతూ సినిమా గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.
ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ఇందులో దుల్కర్ నటన పుష్ప( Pushpa ) సినిమాలోని అల్లు అర్జున్( Allu Arjun ) నుఇమిటేట్ చేసినట్టు ఉందని ఈ సినిమా చూస్తుంటే అల్లు అర్జున్ పుష్ప సినిమాకు కాపీ సినిమా లాగా ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.
అయితే ఈ విషయం గురించి తాజాగా దుల్కర్ సల్మాన్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.
తాను ఏ హీరోని ఇమిటేట్ చేస్తూ ఈ సినిమాలో నటించలేదని అలాగే ఈ సినిమా పుష్ప సినిమాకు కాపీ సినిమా కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు.
"""/" /
దర్శకుడు అభిలాష జోషి 2019వ సంవత్సరంలోనే ఈ సినిమా కథను సిద్ధం చేసుకుని తనకు వివరించారని తెలిపారు.
2019వ సంవత్సరం నుంచి ఈ క్యారెక్టర్ పై తాము వర్క్ చేస్తూ వచ్చామని తెలియజేశారు.
అంతేకానీ పుష్ప సినిమా స్ఫూర్తితో మేము ఈ సినిమా చేసామనే వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు.
ఇక కింగ్ ఆఫ్ కొత్త సినిమాని ఏకంగా పుష్ప సినిమాతో పోల్చడాని తాను నెగిటివ్ గా ఏమాత్రం తీసుకోవడం లేదని, అలాంటి ఒక బ్లాక్ బాస్టర్ సినిమాతో మా సినిమాని పోల్చడం ఒక కాంప్లిమెంట్ అనుకుంటాను అంటూ ఈ సందర్భంగా దుల్కర్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సైబీరియన్ పులి ప్రేమ ప్రయాణం.. 200 కి.మీ దాటి, ప్రేయసి చెంతకు!