Dulquer Salmaan : రీమేక్ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన దుల్కర్ సల్మాన్.. మంచి నిర్ణయం అంటున్న ఫ్యాన్స్?

దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ).ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తూ వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

మలయాళం తో పాటు హిందీ, తమిళం, తెలుగులోనూ చిత్రాలు చేస్తూ ప్రేక్షకాదరణ పొందుతున్నారు.

ఈ నేపథ్యంలోనే దుల్కర్ సల్మాన్ తెలుగులో గత ఏడాది సీతారామం మూవీ( Sitaramam )తో ప్రేక్షకులను పలకరించడంతోపాటు ఈ సినిమాతో భారీ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు హీరో దుల్కర్ సల్మాన్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది.

"""/" / ఇది ఇలా ఉంటే దుల్కర్ సల్మాన్ తాజాగా నటించిన మలయాళీ సినిమా కింగ్ ఆఫ్ కోత( King Of Kotha ).

అభిలాష్ జోషి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.కాగా యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఆగస్టు 24న థియేటర్ లలో లో విడుదల కానుంది.

ఈ సందర్భంగా చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు దుల్కర్ సల్మాన్.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ.మీరు రీమేక్ సినిమాలు చేస్తారా? మీ నాన్న గారి సినిమాల్లో ఏదైనా చేసే అవకాశం ఉందా? అంటూ యాంకర్ ప్రశ్నించగా ఆ విషయం పై స్పందించిన దుల్కర్ సల్మాన్.

"""/" / రీమేక్ సినిమాలు( Remake Movies ) చేసే ఛాన్స్ లేదు.

మా నాన్న సినిమాలని కాదు.ఏ సినిమాను రీమేక్ చేయబోనని స్పష్టం చేశారు.

టాలీవుడ్, బాలీవుడ్ లాంటి ఇండస్ట్రీలో బడా హీరోలు రీమేక్ చేస్తూ హిట్లు కోడుతున్న తరుణంలో దుల్కర్ చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి.

ఇకపోతే దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కోత సినిమా విషయానికి వస్తే.

త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.దుల్కర్ సల్మాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవ్వడంతో అభిమానులు దుల్కర్ సల్మాన్ మాటలను సమర్థిస్తూ మంచి నిర్ణయం తీసుకున్నావు రీమేక్ సినిమాలు మనకు వద్దు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ రివ్యూ & రేటింగ్