‘బాలయ్య109’లో దుల్కర్.. రూమర్స్ పై క్లారిటీ ఇదే!

నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) కెరీర్ లో 109వ సినిమాను ( NBK109 ) ఈ మధ్యనే మొదలెట్టిన విషయం తెలిసిందే.

ఎప్పుడో ఈ ప్రాజెక్ట్ అఫిషియల్ గా ప్రకటించగా ఈ మధ్యనే షూట్ స్టార్ట్ చేసారు.

యంగ్ డైరెక్టర్ బాబీ( Director Bobby ) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై అప్పుడే అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి.

బాలయ్య కూడా ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యాడు.షూట్ స్టార్ట్ చేసిన రోజునే ఒక పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసి హైప్ మరింత పెంచేశారు.

ఇది బాలయ్య టైప్ యాక్షన్ డ్రామా కాదని ఇదొక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో సాగిపోయే ఎమోషనల్ డ్రామా.

కానీ ఇందులో ఫ్లాష్ బ్యాక్ మాత్రం పాలిటిక్స్ నేపథ్యంలో సాగుతుంది అని టాక్.

"""/" / ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) కూడా కీలక రోల్ లో నటిస్తున్నట్టు వస్తున్నా రూమర్స్ కు ఇప్పుడు క్లారిటీ తెలుస్తుంది.

ఈ విషయంలో అయితే ఎలాంటి నిజం లేదట.ప్రజెంట్ ఈ సినిమాలో దుల్కర్ అయితే లేడని సమాచారం.

దీంతో ఈ రూమర్స్ కు చెక్ పడినట్టే చెప్పాలి. """/" / ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఫార్చ్యూన్ 4 ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా నిర్మాతలుగా నాగ వంశీ,( Nagavamshi ) త్రివిక్రమ్ భార్య సౌజన్య( Sowjanya ) వ్యవహరించ బోతున్నారు.

థమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

ఇక ఇటీవలే బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకుంది.

మరి బాబీ కూడా బాలయ్యకు ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.

చుండ్రును సంపూర్ణంగా త‌గ్గించే హోమ్ రెమెడీస్‌ ఇవి..!