తమిళ ప్రజలకి క్షమాపణలు చెప్పిన దుల్కర్! అయిన బెదిరింపులు

సౌత్ ఇండియా స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఒక నటుడుగా అన్ని భాషలలో తన సత్తా చూపిస్తూ దూసుకుపోతున్నాడు.

అయితే తన వలన ఏదైనా తప్పు జరిగింది అంటే ఏ మాత్రం ఆలోచించకుండా క్షమాపణ కోరడానికి అతను సిద్ధమవుతాడు.

ఈ నేపధ్యంలో తాజాగా దుల్కర్ నటించిన మలయాళీ సినిమా వారణే అవశ్యముండే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు.

ఈ సినిమాలోని ఓ సీన్‌ ఎల్‌టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్‌ను అవమానించేలా ఉందని కొంత మంది తమిళ ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

తమిళుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

దీనిపై దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ క్షమాపణలు చెప్పడం విశేషం.తన తరఫున ఆ సినిమా యూనిట్‌ తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు ట్విట్టర్‌లో భావోద్వేగభరిత మెసేజ్‌ పోస్ట్ చేశాడు.

వారణే అవశ్యముండే సినిమాలో ప్రభాకరన్‌ జోక్‌ తమిళ ప్రజలను అవమానించేలా ఉందని చాలా మంది వ్యాఖ్యానించారని, అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని గతంలో వచ్చిన మలయాళ చిత్రం పట్టణ ప్రవేశంలో ఓ సీన్‌లోని జోక్‌‌ స్ఫూర్తితో ఆ సన్నివేశాన్ని రూపొందించామని అన్నాడు.

ఈ సన్నివేశంపై కేరళలో బాగా మీమ్స్‌ చేస్తారని తెలిపాడు.ఇందుకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశాడు.

కొందరు సినిమా చూడకుండానే విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నాడు.అలాగే తన ఫ్యామిలీని చంపేస్తాం అంటూ బెదిరింపులకి పాల్పడుతున్నారని అన్నారు.

తన వలన తమిళ ప్రజల మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కోరారు.

ప్రస్తుతం బిజీగా ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ వీళ్లే.. ఏ హీరోయిన్ చేతిలో ఎన్ని సినిమాలంటే?