ఆ కారణాలతో భారీగా వాలంటీర్ల రాజీనామా 

ఏపీలో వాలంటీర్ల( Volunteers In AP ) వ్యవహారంపై పెద్ద రాజకీయ దుమారమే నడుస్తోంది.

  వాలంటీర్ల ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాలను అందిస్తూ ఉండడంతో, వాటి ద్వారానే గట్టెక్కాలని వైసీపీ భావిస్తుండగా,  వారి సేవలను తాత్కాలికంగా నిలిపివేయించడమే కాకుండా, వారి ద్వారా వైసిపి లబ్ధి పొందకుండా చూసేందుకు టిడిపి ప్రయత్నాలు చేస్తుంది.

  ఇప్పటికే ఏపీలో పెన్షన్లతో పాటు , రేషన్ పంపిణీ( Pensions, Distribution Of Ration ) విషయంలో వాలంటీర్లు జోక్యం చేసుకోవద్దు అంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

దీనిపై టిడిపి,  వైసిపిల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. """/" / ఈ వ్యవహారం ఇలా ఉండగానే ఏపీ వ్యాప్తంగా వాలంటీర్లు చాలామంది రాజీనామాలు చేస్తున్నారు.

ముఖ్యంగా మచిలీపట్నంలో( Machilipatnam ) మూకుమ్మడిగా వాలంటీర్లు రాజీనామా చేయడం చర్చనీయాంశం గా మారింది .

పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను ఎన్నికల సంఘం  దూరం పెట్టింది .దీంతో వాలంటీర్లు మున్సిపల్ కమిషనర్ కు,  అలాగే గ్రామ సచివాలయాల్లోనూ రాజీనామాలు అందిస్తున్నారు .

మచిలీపట్నం నియోజకవర్గంలో మొత్తం 1200 మంది వాలంటీర్లు సేవలందిస్తున్నారు.వీరంతా రాజీనామా చేశారు.

రాజీనామా లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందిస్తూ గత 50 నెలలుగా నిస్వార్థ సేవలు అందిస్తున్నామని , ఎటువంటి రాజకీయాలకు ప్రభావితం కాకుండా సేవలు అందిస్తున్నామని , అయితే కొంతమంది తమ సేవలకు రాజకీయాలు ఆపాదించి ఫిర్యాదు చేశారని , దీనికి తామంతా మనస్థాపానికి గురై రాజీనామాలు చేస్తున్నామని , వాలంటీర్ లు తమ రాజీనామా లేఖల్లో పేర్కొన్నారు.

"""/" / ఒక్కసారిగా  వాలంటీర్లంతా రాజీనామా చేయడంపై కమీషనర్ బాపిరాజు స్పందించారు.మచిలీపట్నంలో వార్డు వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలను పరిశీలిస్తున్నామని , నగరపాలక సంస్థలో 823 మంది వాలంటీర్ పోస్టులు ఉండగా, అందులో 10 , 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయని,  ఇప్పటివరకు 430 మంది నుంచి రాజీనామాలు అందాయి అని తెలిపారు.

వీటన్నిటిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

అమెరికాలో భారతీయ జంట పెద్దమనసు .. స్కాలర్‌షిప్ ఫండ్ కోసం భారీ విరాళం