వస్త్ర పరిశ్రమ బంద్ వలన ఉపాధి లేక కార్మికులు పస్తులు ఉంటున్నారు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం బి.వై.
నగర్ సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్ మాట్లాడుతూ మార్చి 11న వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాలు పవర్లుమ్ , వార్పిన్ , వైపని , ఆసామి , జాపర్ , గుమస్తా ,కండెలు చుట్టేకార్మిక సంఘాల ఆధ్వర్యంలో వెంటనే ఉపాధి కల్పించాలని పెద్ద ఎత్తున సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో అన్ని రంగాల వాళ్ళు యజమాలతో సహా పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.
వస్త్రపరిశ్రమ బందు పడడం వల్ల దానిపై ఆధారపడిన వేలాదిమంది కార్మికులు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో పస్తులు ఉంటున్నారని 15 రోజుల నుండి పూర్తిగా పరిశ్రమ బంద్ పడ్డ కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కార్మికులు , ఆసాములు ఉపాధి కల్పించాలని రోడ్డెక్కి అరుస్తున్న కూడా కార్మికుల ఆకలి కేకలు ప్రభుత్వానికి వినిపించడం లేదన్నారు
ఎందుకు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సమస్యను జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు , మంత్రులు , ముఖ్యమంత్రి దృష్టికి ఎందుకు తీసుకువెళ్తలేరని పవర్లూమ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడం కొత్త ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణి తో వ్యవరిస్తున్నదని పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కార్మికుల పరిస్థితి ఇంకా దయనీయంగా మారే ప్రమాదం ఏర్పడుతుందిని పరిస్థితి తీవ్ర రూపం దాల్చకముందే వెంటనే ప్రభుత్వం కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల్ల సత్యం , ఆసాముల సంఘం నాయకులు బింగి సంపత్ , పవర్లూమ్ పట్టణ అధ్యక్షుడు నక్క దేవదాస్ , బెజుగం సురేష్ , గుండేటి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
జగన్ ను వణికిస్తున్న పదకొండు .. సభలో అడుగు పెడతారా ?