తరుచూ ఫోన్లు వచ్చాయనే కారణంతో ప్రియురాలినే ఏకంగా...

ప్రేమ.రెండక్షరాల పదం.

ఈ పదానికి చాలా పవర్ ఎక్కువ.ప్రేమలో ఉన్న వారు చాలా నిజాయతీగా ఉంటారని కొంత మంది చెబుతారు.

అలాంటిదేం లేదు.వారే ఎక్కువగా అబద్దాలు ఆడుతారని కొందరు చెబుతారు.

ఇలా ఏదేమైనా కానీ ప్రేమలో ఉండే మాధుర్యమే వేరని అనేక మంది అంటూ ఉంటారు.

కానీ కొంత మంది మాత్రం ప్రేమలో చాలా కష్టాలు ఉంటాయని చెబుతూ ఉంటారు.

ఇలా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అని అనుకుంటున్నారా.తనను ప్రాణంగా ప్రేమించిన ప్రియరాలిని అనుమానం అనే పెను భూతంతో ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.

సభ్యసమాజం తలదించుకునేలా ఉన్న ఈ ఘటన గురించి తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు.

ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.ఉత్తర ప్రదేశ్ ​లోని ఘజియాబాద్​ కు చెందిన శివమ్ చౌహాన్ అనే వ్యక్తికి, ఢిల్లీలోని కిషన్ గఢ్​ ప్రాంతానికి చెందిన ఓ మహిళతో ప్రేమ వ్యవహారం నడుస్తోంది.

ఈ సందర్భంగా ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న వారు గత వారం ఓ హోటల్​ కు వెళ్లారు.

హోటల్​ లో ఉన్న సమయంలో ఆ మహిళకు తరుచూ ఫోన్లు వచ్చాయి.దీంతో అనుమానించిన శివం చౌహాన్ నీకు ఫోన్ చేసేది ఎవరని ఆ మహిళను అడిగాడు.

దీనికి ఆ మహిళ తన సోదరుడు కాల్ చేశాడని చెప్పింది.కానీ ఈ విషయం నమ్మని శివమ్ చౌహాన్ ఆమెతో గొడవ పడ్డాడు.

ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిపోయింది.ఈ సందర్భంగా విచక్షణ ను కోల్పోయిన శివం ఆ మహిళను తల పట్టి బలంగా బాదాడు.

దీంతో ఆ మహిళకు తీవ్ర రక్తస్రావం అయి అక్కడికక్కడే మృతి చెందింది.తెల్లవారు జామున హోటల్ నుంచి శిమమ్ ఒక్కడే బయటకు పోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీపికా పదుకొనేకు ఇష్టమైన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా.. ప్రభాస్ మాత్రం కాదంటూ?