పారిపోయిన రాణి పాపం రాజు గారి పరిస్థితి ఏంటి!

ఈ రోజుల్లో భర్తను వదిలి పెట్టి భార్య వెళ్లిపోవడం సామాన్యుల విషయాల్లో ఇటీవల నిత్యం చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఆ భర్త పరిస్థితి ఎలా ఉంటుందో మనం కనీసం ఊహించలేం.

అయితే ఇలాంటి పరిస్థితి ఏకంగా దేశాధినేతల విషయం లో జరిగితే పరిస్థితి ఏంటి అనేది ఆలోచించలేము కూడా.

సరిగ్గా ఇదే జరిగింది దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ఆల్ ముఖ్తమ్ విషయంలో.

కఠినంగా చట్టాలు ఉండే ముస్లిం దేశంలో దేశాధినేత విషయంలో ఇది జరగడం గమనార్హం.

అల్ ముఖ్తామ్ ఆరో భార్య, జోర్డాన్ రాజుకు సవతి సోదరి అయిన హయా బింత్ అల్ హుస్సేన్ రూ.

270 కోట్లకుపైగా సంపదతో పాటు తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తుంది.

"""/"/ కొద్దికాలం క్రితం మొహమ్మద్ బిన్‌ను నుంచి హయా విడాకులు కోరింది.

అంతేకాకుండా దుబాయ్‌లో తనకు ప్రాణహానీ ఉందని తనకు ఆశ్రయం కావాలంటూ జర్మనీని కూడా కోరినట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం ఆమె కనిపించకపోవడం తో ఆమె జర్మనీ దౌత్య వేత్త సాయం తో జర్మనీకి వెళ్ళిపోయి ఉంటుంది అని రాజు కుటుంబసభ్యులు భావిస్తున్నారు.

మరికొందరు ఏమో ఆక్స్ ఫర్డ్ చదువుతున్న హయా లండన్ కు వెళ్ళిపోయి ఉండొచ్చు అని భావిస్తున్నారు.

మరి దీనితో రాజు గారి పరిస్థితి ఏంటో మరి.

వావ్, వాటే ఐడియా.. వాహనదారులకు ఎండ తగలకుండా సిగ్నల్స్‌ వద్ద గ్రీన్ నెట్స్..