వైరల్ వీడియో: ప్రకృతి కన్నెర్ర చేస్తే ఇలాగే ఉంటుంది మరి..
TeluguStop.com
తాజాగా దుబాయ్ దేశంలో( Dubai ) ఆకస్మిక వానలు ఎంతటి ప్రళయాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
వారి దేశంలో ఏడాదిన్నర సమయంలో కురవాల్సిన వర్షం కేవలం 24 గంటల వ్యవధిలో కురిసింది అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో మనం అంచనా వేయవచ్చు.
కుండపోత వర్షం కారణంగా యావత్ యూఏఈని( UAE ) సముద్రంగా మార్చేసింది వాతావరణం.
ఎప్పుడు ప్రజలతో రద్దీగా ఉండే నగరాల రోడ్లన్నీ పూర్తిగా జలమయమై పెద్ద సంఖ్యలో రోడ్లపై నీళ్లలో కార్లు ఆగిపోయాయి.
మరికొన్నిచోట్ల నీళ్లతో పాటు కారులు కూడా కొట్టుకుపోయాయి. """/" /
ఇక గడిచిన 75 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అక్కడ వాన కురిసిందని దుబాయ్ ప్రభుత్వం తెలిపింది.
ఇదో చారిత్రాత్మక ఘటన అంటూ ప్రకృతి విలయాన్ని అభివర్ణించింది.ఇకపోతే వర్షం ఏ రేంజ్ లో కురిసిందో చెప్పడానికి కాను ఓచోట రికార్డ్ అయిన సీసీటీవీ కెమెరాను టైం ల్యాప్స్ వీడియోగా రూపొందించి సోషల్ మీడియాలో వదిలారు.
దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కేవలం 30 సెకన్లు ఉన్న ఈ వీడియో జనాలను భయభ్రాంతులకు గురి చేస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
"""/" /
దట్టమైన మేఘాలు యూఏఈ ని కమ్మిన సమయం నుండి కుండపోత వర్షం వరకు మొత్తం ఆ వీడియోలో మనం చూడవచ్చు.
వీడియోలో మొదటగా పెద్ద పెద్ద మేఘాలు( Clouds ) ఆ ప్రాంతమంతా ఆవరించిన తర్వాత చిరుజల్లులుగా మొదలైన వాన( Rain ) ఆ తర్వాత కుండపోతగా మారడం లాంటి దృశ్యాలను చూపిస్తుంది.
ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ భయభ్రాంతులకు లోనవుతున్నారు.అందుకే ప్రకృతితో మనం ఆడుకోకూడదని.
ఒకవేళ పకృతి కన్నెర్ర చేస్తే మానవాళికి ఎలాంటి కష్టాలు వస్తాయో ఈ వీడియో చూస్తే సరిపోతుందంటూ కామెంట్ చేస్తున్నారు.
మరికొందరైతే.ప్రకృతి శక్తి ఎట్లుంటది అన్నవారికి ఈ వీడియో చూపిస్తే సరిపోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వర్షాలు కేవలం యూఏఈ దేశంలో మాత్రమే కాకుండా సరిహద్దుల్లో ఉన్న ఒమాన్ దేశంలో కూడా అల్లకల్లోలం సృష్టించాయి.
అబ్బా ఏమి ఫిల్ ఉంది మామ.. సంజీవ్ గోయెంకా దిమ్మ తిరిగేలా షాకిచ్చిన కేఎల్ రాహుల్..!