ఉద్యోగం ఇప్పిస్తానని దుబాయ్‌కి, ట్రావెల్ ఏజెంట్ చెరలో నరకం .. భారతీయ మహిళ దీనగాథ
TeluguStop.com
ఆర్ధిక ఇబ్బందులు కావొచ్చు.కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకునే ఆలోచన కావొచ్చు.
ఏదైతేనేం.భారతీయులు ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్తున్నారు.
కానీ అక్కడ అడుగుపెడితే కానీ అసలు విషయం తెలియదు.అవసరంలో వున్నవారిని ఆదుకుంటామని చెప్పి టూరిస్ట్ వీసా( Tourist Visa ) పేరిట వారిని ట్రావెల్ ఏజెంట్లు( Travel Agents ) తరలించే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది.
గడువు ముగిసిన తర్వాత వీరు అక్కడే ఉండిపోతున్నారు.అక్కడి చట్టాలు కఠినంగా ఉండటంతో వీసాలు, పాస్‌పోర్టులు లేనివారు రహస్యంగా జీవిస్తున్నారు.
భారతీయ కార్మికుల భయం, బలహీనతలను ఆసరాగా తీసుకొని యజమానులు, ట్రావెల్ ఏజెంట్లు వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు.
ఇంకొందరైతే విదేశాలకు వెళ్లే క్రమంలో పోలీసులకు దొరికిపోయి.జైల్లో గడుపుతున్నారు.
కనీసం వీరి క్షేమ సమాచారం కూడా కుటుంబ సభ్యులకు తెలియడం లేదు. """/" /
అలా దుబాయ్‌లో( Dubai ) ఓ ట్రావెల్ ఏజెంట్ వద్ద బందీగా వున్న పంజాబీ మహిళ( Punjab Woman ) అతని చెర నుంచి బయటపడింది.
వివరాల్లోకి వెళితే.ఫిరోజ్‌పూర్‌కు చెందిన సుమన్ (పేరు మార్చబడింది) కొన్ని రోజుల క్రితం యూఏఈలోని ఆజ్మాన్‌లో నిర్బంధానికి గురైంది.
కేరళకు చెందిన దుబాయ్‌లో స్థిరపడిన షాటర్‌ను నమ్మి ఆమె గల్ఫ్‌లో అడుగుపెట్టింది.అయితే చట్టపరమైన వివరాలు సరిగా ఇవ్వకపోవడంతో సుమన్ అక్కడే చిక్కుకుపోయింది.
షాటర్ డ్రైవర్ ఆమెను ఎయిర్‌పోర్ట్ నుంచి కారులో ఓ వసతి గృహానికి తీసుకెళ్లాడు.
అక్కడ అప్పటికే ఐదుగురు అమ్మాయిలు వున్నారు.20 రోజులు గడుస్తున్నా తమకు షాటర్ ఎలాంటి ఉద్యోగాన్ని కల్పించలేదని సుమన్ తెలిపింది.
టూరిస్ట్ వీసాపై యూఏఈలో అడుగుపెట్టిన మాకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, వర్క్ వీసా లభిస్తుందని మాయమాటలు చెప్పారని సుమన్ పేర్కొంది.
"""/" /
ఈలోగా తన టూరిస్ట్ వీసా గడువు ముగియడంతో షాటర్ తన నిజస్వరూపం చూపించాడని వాపోయింది.
తనకు డబ్బు ఇవ్వకుంటే జైలుకు పంపిస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడని తెలిపింది.ఈ క్రమంలో తనకు మొబైల్ దొరకడంతో వెంటనే పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సుమన్ పేర్కొంది.
జలంధర్ ఎస్ఎస్పీ ముఖ్విందర్ సింగ్ జోక్యం చేసుకుని తమకు సాయం చేశారని ఆమె తెలిపింది.
పంజాబ్ పోలీసుల చొరవతో, భారత్‌కు చెందిన కొందరు వ్యక్తులు మమ్మల్ని విడిపించి.పంజాబీలు ఏర్పాటు చేసిన క్లబ్‌లో వుంచారని సుమన్ తెలిపింది.
స్థానిక పోలీసులను కూడా ఆశ్రయించామని, త్వరలోనే మా పాస్‌పోర్ట్‌లు కూడా ఇస్తామని వారు హామీ ఇచ్చారని చెప్పింది.
దయచేసి నిజాయితీతో ఉండండి… సంచలనంగా మారిన సమంత పోస్ట్?