నేరస్థులకు సింహస్వప్నం.. ఏడు నెలల్లో 74 మందిపై రౌడీషీట్లు.. డీఎస్పీ సుప్రజ సక్సెస్ కు ఫిదా కావాల్సిందే!

గ్రూప్1 ఉద్యోగం( Group1 ) సాధించాలంటే సులువు కాదనే సంగతి తెలిసిందే.పోలీస్ కుటుంబంలో జన్మించిన సుప్రజ విధి నిర్వహణలో తన తాత, తండ్రి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా ఆ కష్టాలను చూసి ఏ మాత్రం భయపడలేదు.

ఆడపిల్ల పోలీస్ అయితే పెళ్లి సంబంధాలు కుదరవని కొంతమంది కామెంట్లు చేసినా ఆ కామెంట్లను సుప్రజ పెద్దగా పట్టించుకోలేదు.

2015 సంవత్సరంలో గ్రూప్1 అధికారిగా విధుల్లో చేరిన సుప్రజ( Korlakunta Supraja )సామాన్యులకు అండగా నిలిచి ప్రశంసలు అందుకున్నారు.

"""/" / కేవలం 7 నెలల సమయంకో 74 మందిపై సుప్రజ రౌడీషీట్లు తెరిచారంటే విధి నిర్వహణలో ఆమె ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో సులువుగా అర్థమవుతుంది.

కడప జిల్లా నందలూరుకు చెందిన కోర్లకుంట సుప్రజ కరోనా సమయంలో గర్భవతిగా ఉండి కూడా ప్రజలకు సేవ చేశారు.

కొంతకాలం క్రితం ఉత్తమ డీఎస్పీగా( DSP Supraja Award ) ఆమె అవార్డ్ ను అందుకోవడం గమనార్హం.

సుప్రజ కర్నూలులో పని చేసే సమయంలో గ్రామ సర్పంచ్ తన భార్య తప్పిపోయిందని ఫిర్యాదు చేశాడు.

సుప్రజకు అతనిపైనే అనుమానం వచ్చి విచారణ చేయించగా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సుప్రజ అతని నేరాలను ప్రూవ్ చేసి అరెస్ట్ చేశారు.గుంటూరు ఈస్ట్ లో సుప్రజ పని చేసే సమయంలో సామాన్యులను ఇబ్బంది పెడుతున్న ఒక కాల్ మనీ మోసగాడిని అరెస్ట్ చేసి 40 లక్షల రూపాయలు రికవరీ చేశారు.

విధి నిర్వహణలో సుప్రజ ఎన్నో సాహసాలు చేశారు. """/" / దిశా పోలీస్ స్టేషన్ లో డీఎస్పీగా పని చేస్తూ ఎంతోమంది మహిళల సమస్యల( Women's Problems )ను తీర్చానని ఆమె కామెంట్లు చేశారు.

నా భర్త ప్రేమ్ కుమార్ ఐ.ఆర్.

ఎస్ గా పని చేస్తున్నాడని అతని సహకారం వల్లే నేను నా విధులను సరిగ్గా నెరవేరుస్తున్నానని సుప్రజ చెప్పుకొచ్చారు.

డీఎస్పీ సుప్రజ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

వైరల్: జలుబు చేసిందని ఇంగ్లీషులో యజమానికి చెబుతున్న చిలుక!