DSC : ఆర్ సి ఐ చట్టం ప్రకారం టెట్ అర్హత లేకున్నా ప్రత్యేక డీఎస్సీకి అర్హులమే:డిఎడ్ అభ్యర్థి బెలంకొండ సతీష్ గౌడ్

రిహాబిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RCI Act ) 1992 చట్టం ప్రకారం టెట్ అర్హత లేకున్నా ప్రత్యేక డీఎస్సీకి డీఎడ్(స్పెషల్ ఎడ్యుకేషన్) అభ్యర్థులు అర్హులేనని బెల్లంకొండ సతీష్ గౌడ్( DEd Candidate Belamkonda Satish Goud ) గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్( DSC Notification ) జారీ చేసిందని, మార్చి నెల 4వ తేదీ నుంచి దరఖాస్తు సేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు.

ఆర్ సిఐ చట్టం 1992 ప్రకారం డిఎడ్ అభ్యర్థులు టెట్ అర్హత లేకుండానే నేరుగా ప్రత్యేక డీఎస్సీ పరీక్షకు అర్హులని చట్టంలో పేర్కొనబడిందని తెలిపారు.

బిఎడ్ తో పాటు డిఎడ్ అభ్యర్థులు కూడా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవాలంటే టెట్ లో అర్హత సాధిస్తేనే అర్హులని, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ లో పేర్కొన్నాడాన్ని ఖండిస్తున్నామన్నారు.

ప్రత్యేక అవసరాల కోసం పాఠశాల యొక్క విద్యార్థులకు మాత్రమే డీఎడ్ అర్హత ( DEd )ఉన్నవారు విద్యను బోధిస్తారు.

సాధారణ పాఠశాల విద్యార్థులకు వారు విద్యను బోధించరు.డీఎడ్ అభ్యర్థులకు టెట్ అర్హత లేకుండానే డీఎస్సీకి అర్హత కల్పించాలని పేర్కొన్నారు.

నిరుపేద కుటుంబాలలో పుట్టి ఎటువంటి ఆదాయ వనరులు లేకుండా,వెనుకబడిన ఆర్థిక పరిస్థితితో కొట్టుమిట్టాడుతూ సుమారు 10-15 సంవత్సరాల నుంచి ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న డి.

ఎడ్ నిరుద్యోగ అభ్యర్థులు వేలలో ఉన్నారని వారికి టెట్ ను మినహాయించి ప్రత్యేక డీఎస్సీలో అర్హత కల్పిస్తున్నట్టు ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అందాన్ని రెట్టింపు చేసే ఆరెంజ్ పీల్.. ఎన్ని విధాలుగా వాడొచ్చో తెలుసా?