అనంతరం జ్యూస్‌లా చేసుకుని తాగితే తక్షణ శక్తి లభిస్తుంది.రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ ఖర్జూరం అద్భుతంగా సహాయపడుతుంది.
అందుకు ప్రతి రోజు తేనెలో నాన బెట్టిన ఖర్జూరం తీసుకోవాలి.లేదా రోజుకు రెండు, మూడు ఖర్జూరాలను డైలీ డైట్‌లో చేర్చుకున్నా శరీర రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
ప్రస్తుతం ప్రాణాంతక కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న సంగతి తెలిసిందే.ఈ సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అలాగే తేనెతో ఖర్జూరం తీసుకోవడం దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పొటాషియం కూడా ఎండు ఖర్జూరంలో లభిస్తుంది.
అంతేకాకుండా.మెగ్నీషియం, కాపర్ మరియు ఐరన్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
ఇవి ఎముకలను దృఢంగా మారడానికి సహాయపడతాయి.రక్తహీనత సమస్య నుంచి బయటపడేస్తుంది.