నోటిపూతను సుల‌భంగా త‌గ్గించే ఎండుకొబ్బరి..ఎలాగంటే?

నోటిపూతను సుల‌భంగా త‌గ్గించే ఎండుకొబ్బరిఎలాగంటే?

నోటి పూత‌.పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మందిని త‌ర‌చూ తీవ్ర వేద‌న‌కు గురి చేసే స‌మ‌స్య ఇది.

నోటిపూతను సుల‌భంగా త‌గ్గించే ఎండుకొబ్బరిఎలాగంటే?

నోటి పూత వ‌ల్ల తిన‌డానికి, తాగ‌డానికే కాదు మాట్లాడేందుకు సైతం ఎంతో ఇబ్బంది ప‌డుతుంటారు.

నోటిపూతను సుల‌భంగా త‌గ్గించే ఎండుకొబ్బరిఎలాగంటే?

శరీరంలో అధిక వేడి, ఆహార‌పు అల‌వాట్లు, నోటి శుభ్ర‌త లేక పోవ‌డం, శ‌రీరంలో నీటి శాతం త‌గ్గిపోవ‌డం, ఐర‌న్‌.

ఫోలిక్ యాసిడ్‌.విటమిన్ బి వంటి పోష‌కాలు లోపించ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల నోటి పూత ఏర్ప‌డుతుంది.

దాంతో ఈ స‌మ‌స్య‌ను నివారించుకునేందుకు ఆ మందుల‌నీ, ఈ మందుల‌నీ వాడుతుంటారు. """/" / కానీ, కొన్ని స‌హ‌జ సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తే చాలా సుల‌భంగా నోటి పూత స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చు.

మ‌రి ఆ చిట్కాలు ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయ‌ండి.నోటి పూతను త‌గ్గించ‌డంలో ఎండు కొబ్బ‌రి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

అవును, ఒక స్పూన్ ఎండు కొబ్బ‌రికి, పావు స్పూన్ గ‌స‌గ‌సాలు క‌లిపి నోట్లో వేసుకుని బాగా న‌మిలి మింగాలి.

ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే నోటి పూత స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

అలాగే న‌ల్ల నువ్వుల‌ు నోటి పూత స‌మ‌స్య‌ను నివారిస్తుంది.కొన్ని న‌ల్ల నువ్వుల‌ను తీసుకుని మెత్త‌గా దంచి ఉండ‌లా చేసుకోవాలి.

ఇప్పుడు ఈ ఉండ‌ను బుగ్గ‌న పెట్టుకుని కొద్ది కొద్దిగా ర‌సం పీల్చి.చివర్లో పిప్పిని ఉమ్మేయాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా నోటి పూత సూప‌ర్ ఫాస్ట్‌గా త‌గ్గిపోతుంది. """/" / ఇక గిన్నెలో ఒక గ్లాస్ వాట‌ర్ పోసి అందులో గుప్పెడు తుల‌సి ఆకులు వేసి బాగా మ‌రిగించాలి.

ఇప్పుడు ఈ వాట‌ర్‌ను గోరు వెచ్చ‌గా ఆయిన త‌ర్వాత నోట్లో పోసుకుని బాగా పుక్క‌లించి ఉమ్మేయాలి.

ప్ర‌తి రోజు ఉద‌యం, సాయంత్రం ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.