వైరల్ వీడియో: ఎద్దుతో పరాచకాలు ఆడాడు.. కొమ్ములతో దారుణంగా పొడిచింది..!

సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఉద్దేశంతో నేటి యువత ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు.

కొందరు మద్యం తాగి మూగ జీవులతో కూడా పరాచకాలు ఆడుతున్నారు.తాజాగా ఒక వ్యక్తి ఒక ఎద్దుని( Bull ) ఆటపట్టించాడు.

"కమాన్, దమ్ముంటే నన్ను పొడవు" అంటూ దాని ముందుకు వెళ్లి మరీ ఎక్స్‌ట్రాలు చేశాడు.

అతడు రెచ్చగొడుతూ ఉంటే ఆ ఆవులో కోపం కట్టలు తెంచుకుంది.అంతే రెప్పపాటులో అతన్ని తన పదునైన కొమ్ములతో ఎత్తి కుదేసింది.

ఈ ఫన్నీ ఘటనను ఎవరో కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

ఆ వీడియోలో మద్యం మత్తులో ఉన్న ఓ తాగుబోతును( Drunkard ) ఎవరూ ఆపలేకపోవడం మీరు గమనించవచ్చు.

తర్వాత అతను ఎద్దును ఆటపట్టించడం ప్రారంభించాడు.వీడియో చూస్తే అతనికి భయం లేదనిపిస్తోంది.

మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మొదట ఎద్దు నుంచి దూరంగా వెళ్లడానికి ప్రయత్నించాడు, కానీ అకస్మాత్తుగా దాని దగ్గరగా వచ్చి దాన్ని ఆటపట్టించడం స్టార్ట్ చేశాడు.

"""/" / కొద్దిసేపటికే అతను ఎద్దు కొమ్ములను పట్టుకుని వాటిని మెలితిప్పడం ప్రారంభించాడు.

మరోవైపు, ఎద్దు అతన్ని చాలాసార్లు వెనక్కి నెట్టడానికి ప్రయత్నించింది, కానీ ఈ వ్యక్తి మద్యం మత్తులో ఇంకా రెచ్చిపోయి ప్రవర్తించడం ఆరంభించాడు.

ఇక ఆ ఎద్దుకు కోపం కట్టలు తెంచుకుంది.అతనికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది.

తొలుత ఈ ఆకతాయి ఎద్దు కొమ్ములు( Ox Horns ) తిప్పుతూ తనవైపు రాగానే తప్పించుకున్నట్లు వైరల్ అవుతున్న వీడియోలో చూడవచ్చు.

మరుసటి క్షణంలో ఎద్దు తన రెండు కొమ్ములతో అతడిని ఎత్తుకుని గాలిలోకి విసిరింది.

"""/" / అతడి పొట్టలో కొమ్ములతో బలంగా పొడి చేసింది.ఆ దెబ్బకు అతడు నేల పైన పడిపోయి గిలగిల్లాడాడు.

ఆ ఎద్దు ఇంకా దాడి చేస్తుందేమో అని భయపడి నొప్పితోనే అక్కడి నుంచి పారిపోయాడు.

ఆ దెబ్బకు అతడి మత్తు అంతా దిగినట్లు కనిపించింది.స్థానికులు తగిన శాస్తి తగిలిందని ఇతడి వైపు చూడడం మీరు గమనించవచ్చు.

ఈ వీడియోని చూసి చాలామంది నవ్వుకుంటున్నారు.ఇలాంటి వాళ్లకి ఇట్లనే జరగాలి అప్పుడే మళ్ళీ ఎవరి జోలికి వెళ్లరు అని కామెంట్లు పెడుతున్నారు.

ఈ వీడియోను మీరూ చూసేయండి.

ఉత్తర కొరియా చీకటి రహస్యాలు బట్టబయలు.. రష్యన్ టూరిస్ట్ సంచలన వీడియో!