మద్యం మత్తులో స్టీరింగ్ పట్టి.. ఇద్దరిని బలిగొని, అమెరికాలో భారత సంతతి వ్యక్తి నిర్లక్ష్యానికి మూల్యం
TeluguStop.com
అమెరికాలో దారుణం జరిగింది.భారత సంతతికి చెందిన వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి.
వివరాల్లోకి వెళితే.న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో( Long Island, New York ) భారత సంతతికి చెందిన పికప్ ట్రక్ డ్రైవర్ .
మరో కారును ఢీకొట్టడంతో 14 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
నిందితుడిని అమన్‌దీప్ సింగ్( Amandeep Singh ) (34)గా గుర్తించారు.ఇతను బుధవారం జెరిఖోలోని నార్త్ బ్రాడ్‌వేకు ఉత్తర దిశలో 2019 డాడ్జ్ రామ్ సౌత్‌లో తన ట్రక్కును నడుపుకుంటూ వెళ్తున్నాడు.
ఈ క్రమంలో 2019 ఆల్ఫా రోమియా వద్ద నలుగురు ప్రయాణీకులతో వెళ్తున్న ఫోర్ డోర్ సెడాన్ కారును ఢీకొట్టినట్లు నసావు కౌంటీ పోలీసులు గురువారం తెలిపారు.
"""/" /
ఈ ప్రమాదంలో డ్రూ హాసెన్‌బీన్, ఏతాన్ ఫాల్కో విట్జ్( Drew Hasenbein, Ethan Falco Witz ) అక్కడికక్కడే మృతి చెందగా.
మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వీరిని పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు ఫాక్స్ న్యూస్ నివేదించింది.
న్యూయార్క్‌లోని రోస్లిన్‌లో నివసిస్తున్నఅమన్‌దీప్.ప్రమాదం జరిగిన వెంటనే భయంతో అక్కడి నుంచి పారిపోతూ మరో వాహనాన్ని ఢీకొట్టాడు.
ఈ ఘటనలో గాయపడిన 49 ఏళ్ల మహిళ, 16 ఏళ్ల బాలుడికి పోలీసులు ప్రాథమిక చికిత్స అందించి ఇంటికి పంపారు.
నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి రెండు ప్రమాదాలకు కారణమైన సింగ్‌ను పోలీసులు అదే రోజు అరెస్ట్ చేసి స్వల్పగాయాలైన కారణంగా ఆసుపత్రిలో చికిత్స ఇప్పించారు.
"""/" /
అతనిపై హత్య, వాహనంతో మారణహోమం, మద్యం మత్తులో డ్రైవింగ్ తదితర అభియోగాలను నమోదు చేశారు.
అనంతరం అమన్‌దీప్ సింగ్‌ను హోంప్ స్టెడ్‌లోని ఫస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టులో గురువారం హాజరుపరిచారు.
ఘటన జరిగిన సమయంలో నిందితుడి రక్తంలో ఆల్కహాల్ కాన్సంట్రేషన్ చట్టపరమైన పరిమితి కంటే రెండు రెట్లు ఎక్కువని ప్రాసిక్యూటర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ఇతనిపై గతంలోనే మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, దాడి సంబంధించిన నేరాలు వున్నాయని న్యాయస్థానం తెలిపింది.
మే 8న అమన్‌దీప్ సింగ్‌ను మరోసారి కోర్టులో హాజరుపరచనున్నారు.
రష్మిక అబార్షన్ చేయించుకుందా….బాంబ్ పేల్చిన నటుడు…ఆయనే కారణమా?