మద్యం మత్తులో స్నేహితుల వికృత చేష్ట.. మలద్వారంలో గ్లాసు పెట్టి
TeluguStop.com
వాళ్లంతా మిత్రులు.తాగి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు.
కానీ మద్యం చుక్క గొంతులోకి దిగగానే వారిలోని రాక్షసులు నిద్ర లేచారు.ఆ ఫ్రెండ్స్ బృందంలో ఒకరిని మిగతా వాళ్లు టార్గెట్ చేశారు.
అంతా కలిసి అతడిని బంధించి మల ద్వారంలో స్టీల్ గ్లాసు జొప్పించారు.అయితే బాధిత వ్యక్తి దీని గురించి ఎవరికీ చెప్పలేదు.
కానీ నొప్పి తీవ్రం కావడంతో చెప్పలేక తప్పలేదు.ఈ ఘటన ఒడిశాలోని గంజాంజిల్లా బెరంపుర్ లో చోటు చేసుకుంది.
బుగుడా బ్లాక్ పరిధిలోని బలిపాదర్ కు చెందిన 45 ఏళ్ల వ్యక్తి.గుజరాత్ లోని సూరత్ లో నివాసం ఉంటున్నాడు.
అక్కడే 10 రోజుల క్రితం స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు.మద్యం మత్తులో అతడి మిత్రులు స్టీల్ గ్లాసును మలద్వారం గుండా లోపలికి జొప్పించారు.
అప్పటి నుండి అతడిని నొప్పి మొదలైంది.కానీ ఎవరికీ చెప్పలేదు.
రోజురోజుకూ ఆ నొప్పి తీవ్రమవుతూ వచ్చింది.దాంతో ఆ వ్యక్తి సూరత్ నుండి ఒడిశా లోని తన సొంతూరుకు వచ్చాడు.
అప్పటి నుండి నొప్పి మరింతగా పెరిగింది.ఇప్పుడు పొట్ట ఉబ్బడం మొదలు అయింది.
నొప్పి మరింత తీవ్రం కావడంతో ఇక లాభం లేదనుకుని స్థానిక ఆస్పత్రికి వెళ్లి అసలు విషయం చెప్పాడు.
అతడినికి వైద్యులు ఎక్స్ రే తీయించారు.పేగుల్లో గ్లాసు ఉన్నట్లు గమనించారు.
శస్త్ర చికిత్స చేయకుండా బయటకు తీసేందుకు ప్రయత్నించినా.ఫలితం లేకపోవడంతో ఆపరేషన్ చేసి స్టీల్ గ్లాసును బయటకు తీశారు.
Cool Bet Im Überblick: Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten