తమిళనాడులో మద్యం తాగిన పిల్లి.. ఎలా తూలుతుందో చూస్తే..

ప్రతిరోజు సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి.వాటిలో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొన్ని నవ్వు తెప్పిస్తుంటాయి.

తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఈ వీడియోలో పిల్లి( Cat ) పూటుగా మద్యం తాగి సరిగా నిలబడలేకపోయింది.

అయినా అది ముందుకు కదిలింది.ఆ సమయంలో ఈ పిల్లి బాగా తూలుతూ కింద పడిపోతూ పైకి లేస్తూ కనిపించింది.

ట్విటర్ అకౌంట్ ది రియల్ జస్సీ ఈ పిల్లికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది.

"""/" / పిల్లి పక్కన ఉన్న వాహనాల నెంబర్ ప్లేట్ ని గమనిస్తే ఇది తమిళనాడులో( Tamil Nadu ) జరిగినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా తంజావూరు జిల్లాలో ఈ క్యాట్‌ డ్రింక్ చేసినట్లు తెలుస్తోంది.పిల్లి వెనుక ఉన్న షాపు ఒక లిక్కర్ షాప్( Liquor Shop ) అని కూడా అర్థమవుతోంది.

దీని ముందు కొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నారు.వైరల్ వీడియోలో పిల్లి నడకని మనం గమనిస్తే అది ఒక మందుబాబు లాగా వాక్ చేస్తుందని చెప్పవచ్చు.

అయితే అది మందు తాగి అలా నడుస్తుందా లేదంటే ఏదైనా జబ్బు చేసి అలా నడుస్తుందా అనేది తెలియ రాలేదు కాకపోతే వీడియోకు మాత్రం ఈ క్యాట్ బాగా డ్రింక్ చేసి ఇలా తయారయిందని క్యాప్షన్ జోడించారు.

"""/" / ఇటీవల ఎక్స్‌ ప్లాట్‌ఫామ్ లో షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 53 వేలకు పైగా వ్యూస్, వేలల్లో లైకులు వచ్చాయి.

దీన్ని చూసి చాలామంది నవ్వుకుంటున్నారు.అయితే కుక్కలకు, పిల్లలకు ఆల్కహాల్( Alcohol ) చాలా ప్రమాదకరమని, ఇది ఫన్నీ కాదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలో ఏదైనా వీధి కుక్క వస్తే ఆ పిల్లి పరిస్థితి ఏంటి? అని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు.

వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.