వీడియో: పూటుగా తాగిన వరుడు.. వధువు అనుకుని మరదలు మెడలో మాల వేశాడు..??
TeluguStop.com
ఇటీవల కాలంలో వెడ్డింగ్ వీడియోలు( Wedding Videos ) సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతాయి.
ఎందుకంటే అవి చాలా ఆసక్తికరంగా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటున్నాయి.చాలా వీడియోల్లో వధూవరులు చేసే విచిత్రమైన పనులు బాగా నవ్విస్తున్నాయి, ఇవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
ఇటీవల వైరల్ అయిన ఒక వీడియోలో, వరుడు( Groom ) వేదికపై ఎవరూ ఊహించని ఘటన చేశాడు.
ఈ ఘటన చాలా మంది దృష్టిని ఆకర్షించింది.ఆన్‌లైన్‌లో చాలా చర్చనీయాంశమైంది.
"""/" /
ఈ వీడియోలో, వరుడు తన పెళ్లి రోజున చాలా మద్యం తాగి,( Drunk ) తాను ఏమి చేస్తున్నాడో తెలియకుండా వేదికపైకి వెళ్ళాడు.
అతను తన భార్యకు పూలదండ వేయడానికి బదులుగా ఆమె చెల్లెలి మెడలో మాల వేశాడు.
ఈ పొరపాటు వల్ల అతడిని అతిధులు వేదిక పైనే చితక బాదారు.ఇలా మద్యం తాగి అతడు ప్రదర్శించిన ప్రవర్తన చాలా అసహ్యకరంగా, అగౌరవంగా ఉందని అతిథులు కోప్పడ్డారు.
పెళ్లి వంటి ముఖ్యమైన సందర్భాలలో మద్యం సేవించడం మంచిది కాదు.మద్యం ప్రభావంలో తప్పుడు పనులు చేయవచ్చు.
ఇతరులను ఇబ్బంది పెట్టవచ్చు. """/" /
ఈ వీడియో ఎక్స్‌లో పోస్ట్ చేశాక వైరల్ అయింది.
చాలా మంది వీడియోపై ఫన్నీ కామెంట్లు చేశారు."ఇది నాటకం అని నేను అనుకుంటున్నాను లేదా ఏదైనా భోజ్‌పురి సినిమా సన్నివేశం అయి ఉంటుంది.
" అని ఒకరు పేర్కొన్నారు.ఇటీవల కాలంలో వేదిక పైన వధూవరులు( Couples ) ఏదో ఒక తప్పు చేస్తూ చివరికి తన్నులాడుకుంటున్న సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఇలాంటి పనులు చేస్తున్నారా లేదా నిజంగానే ఇవి జరుగుతున్నాయా అనేది మాత్రం నెటిజన్లు తెలుసుకోలేకపోతున్నారు.
ఈ ఫన్నీ వెడ్డింగ్ వీడియోను మీరు కూడా చూసేయండి.
అక్కడ బుకింగ్స్ లో ఆహా అనిపిస్తున్న చరణ్ గేమ్ ఛేంజర్.. ఏం జరిగిందంటే?