వావ్: మునగాకు రసం వల్ల ఎన్ని ప్రయోజనాలా…?!

ప్రస్తుత రోజులలో.ప్రతి ఒక్కరు కూడా పోషకాలు ఉన్న ఆహారపదార్థాలను తీసుకుంటేనే ఆరోగ్యకరంగా ఉండగలుగుతారు.

చాలావరకు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు లాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

ఇక మునగాకు అంటే చాలా వరకు ఇష్టపడి తినే వారు ఎందరో.మునగాకుతో కూరలు చేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది.

ఇక ఈ ఆకు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు లబ్ధి చేకూర్చవచ్చు.

కేవలం ఆకు తినడమే కాకుండా దీని నీరసం చేసుకోవడం ద్వారా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

మునగాకు రసం సేవించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఒకసారి చూద్దామా.ముక్యంగా పసిపిల్లలకు ఎప్పుడూ ఏదో ఒక వ్యాధి తో ఇబ్బందులు పడుతున్నారు.

వారికి ఇన్ఫెక్షన్ దరిచేరకుండా చాలా జాగ్రత్తలు పాటించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే.ఇందుకుగాను మునగాకు రసాన్ని బాగా వేడిచేసి, కొద్దిసేపు చల్లార్చాలి.

అందులో ఉండే నీటిని వేరు చేసి ఆ మిశ్రమాన్ని పాలల్లో కొద్దిగా కలుపుకొని పిల్లలకు ప్రతిరోజు తపిస్తే వారి ఎముకలు బాగా గట్టి పడతాయి.

ఇంకా ఈ మిశ్రమాన్ని చిన్న పిల్లలు మాత్రమే కాకుండా గర్భిణీ స్త్రీలు కూడా తీసుకోవడం ద్వారా గర్భంలో ఉన్న శిశువు పెరుగుదల కూడా ఎంతో సహాయపడుతుంది.

అలాగే ఈ మిశ్రమాన్ని తీసుకోవడం ద్వారా గర్భిణీ స్త్రీలు ప్రసవం కూడా చాలా సులువుగా అవుతుందని నిపుణులు తేల్చారు.

ఇక మరికొందరికి మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట అధికంగా ఉండే సమస్యతో బాధపడుతూ ఉంటారు.

అలాంటి సమయంలో మునగాకు రసంలో కొంచెం కాస్త పాలు కలుపుకొని మిశ్రమాన్ని తాగుతూ ఉంటే మలబద్దకం మూత్రపిండ సమస్యలు వంటివి సులువుగా దరిచేరవచ్చు.

ఇక రేచీకటి వల్ల కంటి సమస్యలు ఉన్నవారు కూడా ఈ రసాన్ని కొంచెం తేనె లో కలుపుకొని తీసుకోవడం ద్వారా రేచీకటి తగ్గడంతో పాటు వారి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

ఇక ఒక గ్లాసు మజ్జిగలో మునగ పువ్వు రసం కాస్త కలుపుకొని సేవించడం వల్ల అజీర్తి, ఉబ్బసం లాంటి గ్యాస్ సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు.

అలాగే మూత్రపిండాల సమస్య ఉండే వారు కూడా మునగాకు రసంలో కాస్త లేత కొబ్బరి నీళ్లు కలుపుకొని తాగితే మంచి ఫలితాలు లభిస్తాయి.

లోక్‌సభ ఎన్నికలు 2024: భారత్‌లో జాగ్రత్త .. తమ పౌరులకు కెనడా హెచ్చరికలు