మహిళ లగేజీలో రూ.161 కోట్ల విలువైన డ్రగ్స్.. ఇందులో అసలు ట్విస్ట్ ఇదే..?

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యలలో డ్రగ్స్ ఒకటి.వీటిని ఆపడానికి ఎంత ట్రై చేస్తున్నా సరే ఎవరి వల్ల కావడం లేదు.

కోట్ల వ్యవహారంతో కూడిన ఈ వ్యాపారాన్ని డ్రగ్‌లార్డ్స్ (Drug Lords)అసలు వదులుకోవడం లేదు.

డబ్బు ఆశ చూపి చాలామందిని ఈ కూపంలోకి లాగుతున్నారు.వారు పోలీసులకు ఏదో ఒక సమయంలో కచ్చితంగా దొరుకుతారు.

అయితే ఇటీవల జరిగిన ఒక సంఘటన చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.డ్రగ్స్ స్మగ్లింగ్ (Drug Smuggling)చేస్తున్న ఒక మహిళ అడ్డంగా దొరికిపోయింది కానీ ఆమె తాజాగా చేసిన అలిగేషన్స్ అందర్నీ అవాక్కయ్యలా చేస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే, చికాగోలోని ఓ'హేర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కిమ్ హాల్‌(Kim Hall) అనే 28 ఏళ్ల బ్రిటీష్ మహిళను అధికారులు అరెస్ట్ చేశారు.

ఆమె లగేజీలో 43 కిలోల కోకెయిన్‌ను కనుగొన్నారు.ఈ మాదకద్రవ్యాల బ్లాక్ మార్కెట్ విలువ రూ.

161 కోట్లకు పైగా ఉంటుంది.యూకేలోని మిడ్‌ల్స్‌బ్రోకు చెందిన హాల్, మెక్సికో (Mexico) నుంచి లండన్‌కు(London) వెళ్లే మార్గంలో చికాగోలో దగ్గర ఆగింది.

అక్కడే అధికారులు సెక్యూరిటీ చెక్ చేస్తూ కోకెయిన్‌ను కనుగొన్నారు.హాల్ తాను అమాయకురాలని ఎప్పుడు చెబుతూ అందరినీ గందరగోళంలో పడేసింది.

తాను మాదకద్రవ్యాలు మోస్తున్నట్లు తనకు నిజంగా తెలియదని ఆమె ఆరోపిస్తోంది.పోర్చుగల్‌(Portugal) యాత్రలో పరిచయమైన ఇద్దరు వ్యక్తులు బ్యాగులు తీసుకెళ్లాలంటూ బలవంతం చేశారని ఆరోపించింది.

వారు ఆమెను మెక్సికోకు ఉచిత సెలవుకు ఆహ్వానించి, తరువాత ఆమెను తుపాకీతో బెదిరించారని తెలిపింది.

ఆ వ్యక్తులు రూ.25 లక్షల నగదు ఉన్న బ్యాగులు ఇచ్చి, వాటిని సురక్షితంగా చేర్చితేనే పాస్‌పోర్ట్ ఇస్తానని చెప్పినట్లు హాల్ ఆరోపించింది.

ఆ బ్యాగులు మాదకద్రవ్యాలతో నిండి ఉన్నాయని తెలియదు కాబట్టే వాటిని తీసుకెళ్లానని ఆమె చెబుతోంది.

తాను నిర్దోషినని బాగా వాదిస్తోంది. """/" / భద్రతా తనిఖీ సమయంలో తన లగేజీని తనిఖీ చేస్తున్నప్పుడు, ఆమె "ఇది చీజ్‌నా?" అని ప్రశ్నించిందని తెలిసింది.

తరువాత, "నేను మాదకద్రవ్యాల స్మగ్లర్‌ని కాదు, నా నిర్దోషిత్వాన్ని నిరూపిస్తాను" అని ఆమె పేర్కొంది.

తనకు బ్యాగులు ఇచ్చిన వారిని నమ్మినట్లు, వాటిలో చట్టవిరుద్ధమైన పదార్థాలు ఉన్నాయని ఎప్పుడూ ఊహించలేదని ఆమె చెప్పింది.

"""/" / ఆగస్టు 18న ఈ అరెస్ట్ జరిగింది.హాల్ ప్రస్తుతం తీవ్రమైన మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

దోషిగా తేలితే ఆమె 60 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనుభవించవచ్చు.ఆమె విచారణ తేదీని ఇంకా నిర్ణయించలేదు.

దర్యాప్తు కొనసాగుతోంది.హాల్ తల్లి ఈ సంఘటనపై షాక్‌కు గురయ్యారు.

హాల్ తాను మరణ శిక్షను ఎదుర్కోవలసి ఉంటుందేమో అని ఆందోళన వ్యక్తం చేసింది.

లండన్ ఇప్పుడు భారతీయులదేనా.. షాకింగ్ రిపోర్ట్ వైరల్..