మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి – కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: మాదకద్రవ్యాల వినియోగం ద్వారా అనేక దుష్పలితాలు ఉంటాయని, వాటి వినియోగాన్ని పూర్తిగా అరికట్టడానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

మిషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మాదకద్రవ్యాలు, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా రూపొందించిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని అధికారులకు సూచించారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, భాగస్వామ్యంతో సమాజంలో మాదక ద్రవ్యాల యొక్క వినియోగాన్ని అరికట్టాలని సూచించారు.

మారకద్రవ్యాల వినియోగం వల్ల ప్రత్యక్షంగా వ్యక్తి ఆరోగ్యము, ఆదాయము, వ్యక్తిగత సమస్యలతో పాటు కుటుంబంపై, సమాజంపై ప్రభావం కనిపిస్తుందని తెలిపారు.

దీనికి సంబంధించిన సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 100 కు తెలియజేయాలని సూచించారు.

అలాగే మిషన్ పరివర్తనలో భాగంగా ఎవరైతే మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారో వారందరినీ డీ అడిక్షన్ సెంటర్ కు తరలించాలని కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ లకు కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, మహిళా శక్తి కేంద్రం కో ఆర్డినేటర్ రోజా, సఖి కేంద్రం నిర్వాహకురాలు పద్మ, తదితరులు పాల్గొన్నారు.

స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వాలా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!!