చికెన్‌లో డ్రగ్స్ దాచి.. భారత సంతతి గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన యూకే పోలీసులు
TeluguStop.com
డ్రగ్స్‌ను దేశ సరిహద్దులు దాటించేందుకు గాను ముఠాలు కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు.
పుష్ప సినిమాలో హీరో తన పాల వ్యానులో ఎర్రచందనం( Red Sandalwood
) దుంగలను వాడినట్లుగా డ్రగ్స్ గ్యాంగ్స్( Drug Gangs ) కూడా కొత్త కొత్త వ్యూహాలను ఫాలో అవుతున్నారు.
ఎంతగా నిఘా పెట్టినా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఈ డ్రగ్స్ ముఠాలు పెద్ద తలనొప్పిగా మారాయి.
తాజాగా యూకేలో ఓ భారత సంతతి గ్యాంగ్ మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడానికి ఫ్రీజ్ చేసిన చికెన్‌ను ఉపయోగించింది.
అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఈ గ్యాంగ్ కుట్రను ఛేదించారు. """/" /
గతవారం బర్మింగ్‌హామ్ క్రౌన్ కోర్టులో( Birmingham Crown Court ) క్లాస్ ఏ నిషేధిత డ్రగ్స్ సరఫరా, మనీలాండరింగ్ కుట్రలో కీలకపాత్ర పోషించినందుకు మణిందర్ దోసాంజ్‌కు( Maninder Dosanjh ) 16 ఏళ్ల 8 నెలల జైలుశిక్ష, అమన్‌దీప్ రిషికి 11 ఏళ్ల రెండు నెలల జైలు శిక్ష విధించింది.
వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ పోలీసులు 400 కిలోల హై ప్యూరిటీ కొకైన్‌తో పాటు 1.
6 మిలియన్ పౌండ్ల అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
కొకైన్ దిగుమతి, ఎగుమతి, టోకు సరఫరా , మనీలాండరింగ్ అంశాలు పరిశోధనలో బయటకొచ్చాయని క్రైమ్ యూనిట్ డిటెక్టివ్ చీఫ్ ఇన్స్‌పెక్టర్ పీట్ కుక్( Chief Inspector Pete Cook ) చెప్పారు.
"""/" /
వెస్ట్ మిడ్‌లాండ్స్ ఆర్వోసీయూ స్వాధీనం చేసుకున్న అక్రమ నగదులో కొంత భాగం టైర్లలో, మెకానికల్ సర్వీస్ వాహనాల వలె ఉన్న పారిశ్రామిక యంత్రాలలో భద్రపరిచారు.
ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్ ప్రాంతంలోని సుట్టన్ కోల్డ్‌ఫీల్డ్‌లోని ఓ గౌడౌన్‌లో దాచిన 225 కిలోల కొకైన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దీనిని ఆస్ట్రేలియాకు ఎగుమతి చేసేందుకు దాచి ఉంచారు.పోలీసులకు, భద్రతా సంస్థలకు దొరక్కుండా ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌ని ఉపయోగించి ఈ గ్యాంగ్ సభ్యులు కమ్యూనికేట్ చేసుకునేవారు.
ఒక టన్ను వరకు కొకైన్ తరలింపు, సరఫరా, నిర్వహణ, యూకేలో పెద్ద మొత్తంలో క్రిమినల్ మనీ సేకరించడం గురించి ఈ మెసేజ్‌లో చర్చించారు.
భారత్ బెస్ట్ అయితే అక్కని అమెరికాకు ఎందుకు.. కుర్రాడి క్వశ్చన్‌తో MTV యాడ్ సెన్సేషన్!