శ్రీలంక నుంచి భారత్‌లోకి ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా

శ్రీలంక నుంచి భారత్‌లోకి భారీగా ఆయుధాలు, మత్తు పదార్థాల సరఫరా జరుగుతున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏకు సమాచారమందింది.

దాంతో, తమిళనాడులోని 22 చోట్ల ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది.పాకిస్థాన్‌కు చెందిన హాజీ సలీమ్‌ సహకారంతో సి గునశేఖరన్ అలియాస్ గుణ‌, పుష్పరాజన్‌ అలియాస్ పూకుట్టి కన్నా ఈ శ్రీలంక డ్రగ్స్‌ మాఫియాను నడుపుతున్నట్టు ఎన్ఐఏ గుర్తించింది.

ఎల్‌టీటీఈని పునరుద్ధరించేందుకు ఈ ముఠా ప్రయత్నిస్తున్నదనే వార్తల నేపథ్యంలో నిఘావర్గాలు అప్రమత్తమయ్యాయి.చెన్నై, తిరుప్పూర్‌, చెంగళ్‌పట్టు, తిరుచిరాపల్లి జిల్లాల్లోని పలువురు అనుమానితుల ఇళ్లల్లో అధికారులు.

సోదాలు చేపట్టారు.ఈ సోదాల్లో డిజిటల్‌ పరికరాలు‌, పలు నేరాలకు సంబంధించిన పత్రాలను ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ మాఫియా ముఠా పాకిస్థాన్ కేంద్రంగా డ్రగ్స్‌, ఆయుధాలను భారత్‌, శ్రీలంకల్లో సరఫరా చేస్తున్నట్లు ఎన్ ఐ ఏ అధికారులు తెలిపారు.

లిబరేషన్ టైగర్స్ ఆఫ్‌ తమిళ్‌ ఈలం ఎల్‌టీటీఈని పునరుద్ధరించడమే వారి లక్ష్యమని ఎన్ఐఏ గుర్తించింది.

శ్రీలంక సైన్యం, ఎల్‌టీటీఈ మధ్య మూడు దశాబ్దాల పోరాటం 2009 మే నెలలో ముగిసింది.

శ్రీలంకలోని తూర్పు ప్రాంతంలో ప్రత్యేక తమిళ దేశం ఏర్పాటు లక్ష్యంగా వేలు పిళ్లై ప్రభాకరన్ 1976లో ఎల్‌టీటీఈని స్థాపించారు.

పెద్ద సంఖ్యలో సాయుధ దళాలను ఏర్పాటు చేసిన ప్రభాకరన్ శ్రీలంక సైన్యంపైనే దాడులు నిర్వహించేస్థాయికి పోరాటాన్ని విస్తరించారు.

"""/" / చివరికి శ్రీలంక సైన్యం చేపట్టిన భారీ ఆపరేషన్ లో ప్రభాకరన్ సహా ఎల్‌టీటీఈ ముఖ్య నేతలంతా చనిపోయారు.

దాంతో, శ్రీలంక సైన్యం, ఎల్‌టీటీఈ మధ్య మూడు దశాబ్దాలపాటు సాగిన పోరాటం 2009 మే నెలలో ముగిసింది.

శ్రీలంకలో తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభం నెలకొన్న ఈ సమయంలో తమిళనాడు వారధిగా ఆయుధాల సరఫరా జరుగుతున్నట్టు ఎన్‌ఐఏ సోదాల్లో తేలడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎల్‌టీటీఈ అధినేత ప్రభాకరన్ శ్రీలంక సైన్యం చేతిలో చనిపోయినపుడు గోటబయ రాజపక్స సోదరుడు మహింద రాజపక్స ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నాడన్నది గమనార్హం.

తాజా పరిణామాల్లో రాజపక్స కుటుంబం పట్ల శ్రీలంక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఇప్పటికే గోటబయ రాజపక్స తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసి విదేశాల్లో తలదాచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఎల్ టీటీఈ పునరుద్ధరణ జరుగుతుందన్న సమాచారం భారత్ కన్నా శ్రీలంక ప్రభుత్వాన్ని కలవరపెట్టనున్నది.

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లతో పోల్చి చూస్తే ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎంతో గ్రేట్.. ఏం జరిగిందంటే?