మాదకద్రవ్యాల వినియోగం ప్రాణాంతకరం:ఎస్ఐ జి.అజయ్ కుమార్
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:మాదకద్రవ్యాల వినియోగం ప్రాణాంతకమని, యువత వాటికి దూరంగా ఉండాలని సూర్యాపేట జిల్లా నడిగూడెం ఎస్ఐ జి.
అజయ్ కుమార్( SI G.Ajay Kumar)అన్నారు.
బుధవారంమండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సుమారు 30 మంది యువతకు డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్,గంజాయి నిర్మూలన మన అందరి బాధ్యతని అన్నారు.
యువత డ్రగ్స్ కు బానిసైతే మంచి భవిష్యత్తును కోల్పోతారని సూచించారు.గంజాయి రవాణా,వినియోగం గురించి తెలిస్తే పోలీస్ వారికి సమచారం ఇవ్వాలని యువతను కోరారు.
అనంతరం డ్రగ్స్ నిర్మూలనపై ప్రచురించిన కర పత్రాలను యువతకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జగన్నాథం,( ASI Jagannath )పోలీస్ సిబ్బంది వీరబాబు,యువకులు పాల్గొన్నారు.
రోడ్డు రోలర్‌ను కూడా వదలలే.. స్క్రాప్‌కు అమ్మేశారు.. తెలంగాణలో షాకింగ్ చోరీ!