యూకే : ఫ్రెండ్ గదిలో శవమై తేలిన భారత సంతతి విద్యార్ధి.. రెండేళ్ల నాటి కేసులో డ్రగ్ డీలర్‌కు జైలు
TeluguStop.com
భారత సంతతికి చెందిన విద్యార్ధి మృతి కేసులో డ్రగ్ డీలర్( Drug Dealer )కు యూకే కోర్ట్ నాలుగున్నర సంవత్సరాలు జైలు శిక్ష విధించింది.
2021 మార్చిలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ట్రినిటీ కాలేజీ( Trinity College )లో స్నేహితుడి గదిలో 20 ఏళ్ల కేశవ అయ్యంగార్( Keshava Iyengar ) శవమై తేలాడు.
ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన కేంబ్రిడ్జ్ షైర్ పోలీసులు .ఫార్మాసిస్ట్‌గా చెప్పుకుంటున్న బెంజమిన్ బ్రౌన్‌పై నిఘా పెట్టారు.
కేశవ మరణానికి మాదకద్రవ్యాలకు సంబంధం వుందని కరోనర్ నివేదిక ఇవ్వడం ఈ సమయంలో కలకలం రేపింది.
పోలీసుల విచారణలో ‘‘లీన్ క్సాన్ మ్యాన్’’ అనే డ్రగ్ డీలర్‌తో చేసిన సంభాషణలు అతని ఫోన్‌లో బయటపడ్డాయి.
సదరు లీన్ క్సాన్ మ్యాన్ ఎవరు అనే దానిపై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో సర్రేలోని గిల్డ్ ఫోర్డ్‌కు చెందిన 32 ఏళ్ల బ్రౌనే ‘‘లీన్ క్సాన్ మ్యాన్’’గా తేలింది.
"""/" /
బ్రౌన్ తన ఇంటి బెడ్‌రూమ్‌నే కేంద్రంగా చేసుకుని భారీ డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నాడని కేసును పరిశోధించిన కేంబ్రిడ్జ్ షైర్ పోలీస్ విభాగం డిటెక్టివ్ కానిస్టేబుల్ డాన్ హార్పర్ చెప్పారు.
బ్రౌన్ చర్యలు కేశవ మరణానికి( Keshava Iyengar ) కారణమైందని నిరూపించడం సాధ్యం కాదని.
కానీ డ్రగ్స్ అనేవి జీవితాలను నాశనం చేస్తాయని తాను కచ్చితంగా చెప్పగలనని డాన్ తెలిపారు.
ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ ద్వారా మందులను విక్రయిస్తానంటూ బ్రౌన్ తనను తాను ‘‘ఫార్మాసిస్ట్’’గా చెప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.
"""/" /
కేశవ మృతి కేసులో జూలై 2021లో బ్రౌన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అతని ఇంటిలో నిర్వహించిన సోదాల్లో డ్రగ్స్ , 15,000 పౌండ్ల నగదును, బిజినెస్ లోగో వున్న స్టిక్కీ లేబుల్స్‌ను కనుగొన్నారు.
నిషేధిత, నియంత్రిత పదార్ధాల సరఫరాకు సంబంధించి నమోదైన రెండు కౌంట్ల అభియోగాలను బ్రౌన్ అంగీకరించాడు.
తీర్పు సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.బ్రౌన్ మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని గణనీయమైన, అధునాతనమైన, లాభదాయకమైన వ్యాపారంగా అభివర్ణించారు.
డబ్బు సంపాదించాలనే దురాశతో ప్రిస్క్రిప్షన్ మందులపై ఆధారపడ్డ వారి బలహీనతలను ఆసరాగా చేసుకున్నాడని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
వెంకీ అట్లూరి తో సినిమాకి సిద్ధం అయిన అక్కినేని హీరో…