వానా కాలంలో మునుగుతూ.. ఎండాకాలంలో తేలియాడే చర్చి..

మన దేశం ఎన్నో అద్భుతాలను, ఆకర్షించే కట్టడాలను కలిగి ఉంది.దానికి తోడు మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు మన చుట్టుపక్కలే ఉన్నా.

వాటి గురించి మనకు తెలియదు.ఒకానొక సమయంలో వాటిని చూస్తుంటే మనకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

అలాంటివి భారత దేశంలో ఎన్నో ఉన్నాయి.ఇలాంటి వాటిని కొన్ని సార్లు మనం చూస్తుంటే ఆర్చర్యం కలగక మానదు.

అలాంటి ఎక్కడెక్కడ ఉన్నాయంటూ మనమే వెతికే పనిలో పడతాం.సరిగ్గా ఇలాంటి కట్టడమే కర్నాటకలో ఉంది.

హాసన్ ప్రాంతానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రత్యేక కట్టడం ఉంది.

దాని పేరు శెట్టిహళి రోసరీ చర్చి.ఈ చర్చికి ఓ స్పెషాలిటీ ఉంది.

అది ఏంటంటే ఇది ఒక్కోసారి నీటిలో మునుగుతూ, తేలుతూ కనిపిస్తుంది.మునుగుతూ తేలడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి.

స్థానికులు ఈ చర్చిని మునిగిపోయిన చర్చి లేదా తేలియాడే చర్చి అని పిలుస్తుంటారు.

1860లో దీనిని నిర్మించారు.ప్రస్తుతం ఈ చర్చి శిథిలావస్థకు చేరింది.

1960‌లో ఈ ప్రాంతంలో హేమవతి నది నీటి కోసం ఇక్కడ గోరీ అనే రిజర్వాయర్‌ను నిర్మించారు.

దీంతో రిజర్వాయర్‌కు సంబంధించిన నీరు మొత్తం ఈ చర్చి చుట్టూ చేరింది.అలా సుమారు ఏడాది పాటు ఈ చర్చి నీటిలో మునిగిపోయింది.

వర్షాకాలం వచ్చిందంటే వర్షానికి కురిసిన నీటితో ఈ చర్చి మునిగిపోతుంది.కేవలం ఒక వంతు మాత్రమే కనిపిస్తుంది.

మిగతా భాగం అంతా నీటిలో మునిగి పోతుంది. """/"/ వేసవి కాలంలో ఈ చర్చి పూర్తిగా కనిపిస్తుంది.

ఎంతో ఆధ్యాత్మికతతో రూపుదిద్దుకున్న ఈ చర్చి ప్రస్తుతం పక్షులకు ఆవాసంగా మారింది.దీనిని చూసేందుకు పర్యటకులు సైతం ఆసక్తి చూపుతున్నారు.

ఇలాంటి కట్టడాలు, ఆకట్టుకునే ప్రాంతాలు అంటే మీకూ ఇష్టమా అయితే ఇటు వైపు మీరూ ఓ లుక్కేయండి మరి.

పెరుగుతోన్న వలసలు.. రిషి సునాక్ చేతికి ‘‘ రువాండా పాలసీ ’’ , ఇక ఎవరూ ఆపలేరన్న యూకే ప్రధాని