కుడి కాలువకు త్రాగునీటి విడుదల..!
TeluguStop.com
నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ జలాశయం నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి త్రాగునీటి అవసరాలకు ఎన్ఎస్పీ అధికారులు శుక్రవారం కుడి కాలువకు నీటిని విడుదల చేశారు.
రోజుకి 6 వేల క్యూసెక్కుల చొప్పున 9 రోజుల పాటు మొత్తం 3 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఎడమ కాలువ కింద ఆయకట్టు మొత్తం నీరులేక ఎండిపోతుంది.
కనీసం ఒక్క పదిరోజులైనా నీటిని విడుదల చేస్తే పంటలు చేతికొస్తాయని రైతులు నిత్యం ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
రాష్ట్రపతి భవన్ చరిత్రలో అరుదైన వివాహం