ఆల్కహాల్ తాగితే ఎంత ప్రమాదమో తెలుసా..? ప్రాణం పోయే అవకాశం కూడా..!
TeluguStop.com
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాలిక్ డ్రింక్స్( Alcoholic Drinks ) వినియోగం విపరీతంగా పెరుగుతుంది.
అయితే వయస్సు, ఆడ, మగ అనే తేడా లేకుండా ఆల్కహాల్ తాగుతూ ఉన్నారు.
మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే ఈ విధంగా ఆల్కహాల్ తాగడం వలన అనారోగ్యాలు కొని తెచ్చుకోవడమే అని అంటున్నారు వైద్య నిపుణులు.
అయితే ఆల్కహాల్ ను విపరీతంగా తీసుకోవడం వలన ఇది ప్రాణాలను హరించే అనారోగ్యాలకు కారణమవుతుందని చెప్పవచ్చు.
పరిమితికి మించి ఆల్కహాల్ తీసుకోవడం వలన శరీరానికి కచ్చితంగా వినాశకరంగా మారే అవకాశం ఉంది.
"""/" /
అయితే ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వలన కాలేయం, కడుపు, గుండె, మెదడు, నాడి వ్యవస్థకు చాలా తీవ్రంగా హాని కలుగుతుంది.
అదేవిధంగా ఇది నోరు, గొంతు, స్వర పేటిక, అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
ఎందుకంటే ఎక్కువగా తాగే వాళ్ళు సరిగా తినరు.దీంతో వారు విటమిన్, ఖనిజాలా లోపం బారిన పడుతారు.
దీంతో వాళ్ళు తమ శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ ను( Immunity Power ) కోల్పోతారు.
దీని ద్వారా ప్రాణాంతకరమైన వ్యాధులు శరీరానికి సోకుతాయి.ఆ వ్యాధులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్యపానం ఎక్కువగా తీసుకోవడం వలన ప్రధానంగా గుండె జబ్బులు( Heart Problems ) కచ్చితంగా వస్తాయి.
"""/" / అలాగే అధిక రక్తపోటు, ఊబకాయం ఉన్నవారు కూడా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటే ఇలాంటి గుండె జబ్బులు కచ్చితంగా వస్తాయి.
దీర్ఘకాలికంగా మద్యపానం తీసుకోవడం వలన హార్ట్ స్ట్రోక్, సడన్ కార్డియాక్ డెత్, కార్డియోమయోపతి లాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వలన క్యాన్సర్ కణాలు కూడా పెరుగుతాయి.దీంతో క్యాన్సర్ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది.
ఈ విధంగా చాలామంది క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు.ఇక ఆల్కహాల్ ను ఎక్కువగా తీసుకోవడం వలన కాలేయం పనితీరు మందగించి లివర్ డిసీజ్ కూడా వస్తుంది.
దీనివల్ల లివర్ పాడైపోయి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.