ఖాళీ కడుపుతో ఈ వాటర్ తాగితే వెయిట్ లాస్ నుంచి షుగర్ కంట్రోల్ వరకు ఎన్నో బెనిఫిట్స్!

ఉదయం లేవగానే చాలా మంది టీ, కాఫీ వంటివి తాగుతుంటారు.వాటి వల్ల ఆరోగ్యానికి ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.

ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ వాటర్ మాత్రం మీ హెల్త్ కి ఎంతో మేలు చేస్తుంది.

ఖాళీ కడుపుతో ఈ వాటర్ ని తాగితే వెయిట్ లాస్ (Weight Loss)నుంచి షుగర్ కంట్రోల్ వరకు ఎన్నో అమోఘమైన బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

ఇంతకీ ఆ మ్యాజికల్ వాటర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు(Fenugree), ఒక కప్పు వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.

అలాగే మరొక గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు(Anise Seeds), ఒక కప్పు వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.

ఇంకొక గిన్నెలో ఐదు నుంచి ఆరు ఎండు ద్రాక్షలను(Raisins) చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్ పోసి నైట్‌ అంతా నానబెట్టుకోవాలి.

"""/" / మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి నానబెట్టుకున్న మెంతులు, సోంపు గింజలు మరియు ఎండు ద్రాక్షలను వాటర్ తో సహా వేసి కనీసం ఐదు నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి సేవించాలి.

ఈ వాటర్ ను ప్రతిరోజు ఖాళీ కడుపుతో తీసుకుంటే సూపర్ ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవుతారు.

"""/" / రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.

శరీరంలో అధిక వేడి తొలగిపోతుంది.జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది.

శరీరంలో మలినాలు తొలిగిపోతాయి.బాడీ డీటాక్స్ అవుతుంది.

రక్తహీనత సమస్య ఉన్న సరే దూరం అవుతుంది.కాబట్టి హెల్తీ గా ఫిట్ గా ఉండాలని భావించేవారు తప్పకుండా ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఈ మ్యాజికల్ వాటర్ ను తీసుకునేందుకు ప్రయత్నించండి.