ఈ జ్యూస్ తాగితే బ‌రువు త‌గ్గుతారు.. అంద‌మూ పెరుగుతుంది!

ప్ర‌స్తుత రోజుల్లో కోట్లాది మందిని క‌ల‌వ‌ర పెడుతున్న స‌మ‌స్య అధిక బ‌రువు.బ‌రువు పెర‌గ‌డం వ‌ల్ల శ‌రీర ఆకృతి అస‌హ్యంగా మార‌డ‌మే కాదు.

అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడుతుంది.అందుకే బ‌రువును త‌గ్గించుకోవ‌డం కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

క‌ఠిన‌మైన డైట్ల‌ను ఫాలో అవుతారు.రెగ్యుల‌ర్ గా వ్యాయామాలు చేస్తూ చెమ‌ట‌లు చిందిస్తుంటారు.

ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్ప‌బోయే జ్యూస్‌ను ఖ‌చ్చితంగా మీరు మీ డైట్‌లో చేర్చుకోవాల్సిందే.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ జ్యూస్ ఏంటీ.? అస‌లు ఆ జ్యూస్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఏయే లాభాలు ల‌భిస్తాయి.

? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా నాలుగు లేదా ఐదు ఉసిరి కాయ‌ల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డ‌గాలి.

ఇలా క‌డిగిన ఉసిరి కాయ‌ల‌ను గింజ తొల‌గించి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్క‌లు, పావు టేబుల్ స్పూన్ జీల‌క‌ర్ర, రెండు న‌ల్ల మిరియాలు, ప‌ది క‌రివేపాకు ఆకులు, పావు స్పూన్ పింక్ సాల్ట్ మ‌రియు అర లీట‌ర్ వాట‌ర్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మాన్ని స్ట్రైన‌ర్ సాయంతో స‌ప‌రేట్ చేస్తే ఆమ్లా జ్యూస్ సిద్ధం అవుతుంది.

ఈ జ్యూస్‌ను వారంలో మూడు సార్లు తీసుకుంటే ఒంట్లో పేరుకుపోయిన‌ కొవ్వు క‌రిగి.

క్ర‌మంగా బ‌రువు త‌గ్గుతారు.అలాగే ఈ జ్యూస్ ను తీసుకోవ‌డం వ‌ల్ల అంద‌మూ పెరుగుతుంది.

ఆమ్లా జ్యూస్‌లో యాంటి ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉంటాయి.అవి చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తాయి.

ముఖ్యంగా వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌ర‌గా రాకుండా ఉంటాయి.చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మెరుస్తుంది.

కాబ‌ట్టి, బ‌రువు త‌గ్గాలి.అదే స‌మ‌యంలో అంద‌మూ రెట్టింపు అవ్వాలంటే త‌ప్ప‌కుండా ఈ జ్యూస్‌ను తీసుకోండి.

కోట్లు ఇచ్చినా సరే ఈ నలుగురు హీరోలు చచ్చిన ఆ పని చేయలేదు !