పేపర్ కప్పులలో టీ తాగుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

సాధారణంగా మనం ఇప్పుడు ఏ పార్టీలకు వెళ్లిన, ఫంక్షన్లకు వెళ్లినా అక్కడ మన ప్లాస్టిక్ కప్పులు దర్శనమిస్తాయి.

కాఫీలు,టీలు తాగడానికి ప్లాస్టిక్ కప్పులను ఏర్పాటు చేసి ఉంటారు.అంతేకాకుండా ప్రతి ఒక్కహోటల్లో,బస్టాండ్లలో,రైల్వే స్టేషన్లలో మనము ఈ టీ కప్పులను తరచు వినియోగించడం చూస్తూ ఉంటాము.

ఈ టీ కప్పులో తాగడం వల్ల కొద్దిగా పని కలిసి వచ్చినప్పటికీ, జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఈ కప్పులలో టీ తాగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

డిస్పోజబుల్ కప్పులు తయారు చేసేటప్పుడు అందులో కొద్ది పరిమాణంలో ప్లాస్టిక్ ను ఉపయోగించి తయారుచేస్తారు.

మనం వేడివేడిగా కాఫీ,టీ ఆ కప్పులలో వేసినప్పుడు అందులో ఉన్న ప్లాస్టిక్ కణాలు కరిగి కాఫీ ద్వారా మన శరీరం లోకి వెళ్లి అనేక సమస్యలను ఏర్పరుస్తాయని,ఐఐటీ ఖరగ్ పూర్ కు చెందిన ప్రొఫెసర్లు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు.

ఈ కప్పులో టీ తాగుతున్నప్పుడు తాత్కాలికంగా ఎలాంటి సమస్యలు ఎదురుకానప్పటికీ, భవిష్యత్తులో వీటివల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.

మనం డిస్పోజబుల్ కప్పులు చూసినప్పుడు అవి మెరుస్తూ కనిపిస్తాయి.అలా మెరవడానికిగల కారణం ఆ కప్పులపై మైనపు పూత ఉండటంవల్ల, పేపర్ కప్పులలో హైడ్రోఫోబిక్ ఫిల్మ్ పొరలను వాడటం వల్ల అవి మెరుస్తూ అందంగా తయారవుతాయి.

మనం వేడి పదార్థాలు అందులో వేసుకొని తాగినప్పుడు ఆ మైనం కరిగి మన శరీరంలో పేరుకుపోతుంది.

ఎక్కువ మొత్తంలో ఈ మైనం పేరుకుపోవడం వల్ల కడుపులో ఉబ్బరం, జీర్ణక్రియకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తడం, పేగులు పనితీరును తగ్గించడం వంటి సమస్యలకు కారణమవుతుంది.

వేడివేడి కాఫీ, టీ లను డిస్పోజబుల్ కప్పులలో మూడుసార్లు కన్నా ఎక్కువగా తాగినప్పుడు దాదాపుగా 75 వేల అతి సూక్ష్మ మైక్రో ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి చేరుతాయని ఈ పరిశోధనలో వెల్లడించారు.

అందువల్ల వీలైనంత వరకు కాఫీ, టీ లను స్వచ్ఛమైన స్టీల్ గ్లాసులు లేదా గాజు గ్లాసులలో తాగడం ఉత్తమమని ఈ సందర్భంగా పరిశోధకులు తెలియజేస్తున్నారు.

China : వీడియో: చైనాలో షాకింగ్ దృశ్యం.. కుప్పకూలిపోయిన షాపింగ్ మాల్ ఫ్లోర్..