నిద్రించే ముందు పాల‌లో నెయ్యి క‌లిపి తాగితే..మ‌స్తు బెనిఫిట్స్‌?

పాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి.అలాగే పాల నుంచి వ‌చ్చే నెయ్యి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

పాల‌లో ప్రోటీన్స్‌, కాల్షియం, పొటాషియం, పాస్పరస్, విటమిన్ డి వంటి పోష‌కాలు ఉంటే.

విటమిన్ ఎ, విట‌మిన్ డి, విట‌మిన్ ఇ, విట‌మిన్ కె, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ నెయ్యిలో ఉంటాయి.

ఇక ఈ రెండిటిని విడి విడిగా తీసుకుంటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ పొందుతామో అంద‌రికీ తెలిసిందే.

అయితే క‌లిపి తీసుకంటే మ‌రిన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు పొందొచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా ప్ర‌తి రోజు నిద్ర పోయే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో అర స్పూన్ నెయ్యి క‌లిపి సేవిస్తే.

మ‌స్తు బెనిఫిట్స్ పొందొచ్చు.మ‌రి ఆ బెనిఫిట్స్ ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మందికి రాత్రుళ్లు తిన్న ఆహారం అర‌గ‌దు.దాంతో గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం, ఎసిడిటీ వ‌చ్చి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటారు.

అయితే పాల‌లో నెయ్యి క‌లిపి నిద్రించే ముందు తాగితే తిన్న ఆహారం త్వ‌ర‌గా డైజెస్ట్ అవుతుంది.

దాంతో ఎలాంటి జీర్ణ స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి. """/"/ అలాగే బిజీ బిజీ లైఫ్‌లో చాలా మంది రాత్రుళ్లు ప్ర‌శాంత‌గా నిద్ర పోలేక‌పోతుంటారు.

అయితే ప్ర‌తి రోజు గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా నెయ్యి క‌లిపి సేవిస్తే మంచి నిద్ర ప‌డుతుంది.

మ‌రియు ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్యలు కూడా దూరం అవుతాయి.నెయ్యి క‌లిపిన పాల‌ను రెగ్యుల‌ర్‌గా తీసుకుంటే చ‌ర్మం ఎల్ల‌ప్పుడు మృదువుగా, కాంత‌వంతంగా, య‌వ్వ‌నంగా ఉంటుంది.

జుట్టు కూడా ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది.కంటి చూపు త‌గ్గుతుంద‌ని భావించే వారు నిద్రించే ముందు పాల‌లో నెయ్యి క‌లిపి తీసుకోవాలి.

ఇలా చేస్తే క్ర‌మంగా కంటి చూపు మెరుగుతుంది.అంతేకాదు ఎముక‌ల, కండ‌రాలు, దంతాలు దృఢంగా మార‌తాయి.

ఇమ్యూనిటీ ప‌వ‌ర్ క‌డా పెరుగుతుంది.

ముంబై వీధిలో మర్దన కాదు పెడబొబ్బలు.. ఇన్‌ఫ్లుయెన్సర్ పరిస్థితి చూస్తే నవ్వాపుకోలేరు!