మజ్జిగ తాగితే మంచిదే.. కానీ ఏ సమయంలో తాగాలో తెలుసా..?
TeluguStop.com
వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా మజ్జిగ ( Buttermilk )తాగడం మొదలు పెడుతూ ఉంటారు.
అయితే వేసవి కాలంలో ఈ వేడికి తట్టుకోలేక ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చూసినా మజ్జిగను తాగడానికి ఇష్టపడతారు.
నిజానికి ఇది శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు ఎన్నో వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది.
అయితే దీని ఉపయోగం ద్వారా గట్ ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది.అలాగే శరీరంలో నీటి కొరత కూడా ఉండదు.
అంతేకాకుండా ఎన్నో పోషకాలు కూడా లభిస్తాయి.ఇక ఇందులో పొటాషియం, విటమిన్ బి12, కాల్షియం, ఐరన్, ఫైబర్, ఆంటీ యాక్సిడెంట్ లక్షణాలు కూడా మజ్జిగలో ఉన్నాయి.
"""/" /
అందుకే వేసవికాలంలో తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మజ్జిగను తీసుకోవడం చాలా అవసరం.
అయితే వేసవిలో ఎప్పుడైనా మజ్జిగ తాగవచ్చా? లేదా? అన్నది ప్రశ్న.ప్రతి భోజనానికి మజ్జిగ తాగడానికి ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు.
అయితే లంచ్, డిన్నర్, అల్పాహారం( Lunch, Dinner, Breakfast ) ఇలా ప్రతి దాంట్లో తమ ప్లేట్లో మజ్జిగ ఒక భాగంగా చేసుకుంటూ ఉంటారు.
కానీ ఇలా చేయడం సరైనదేన? మజ్జిగ తాగడానికి సరైన సమయం ఏది? మజ్జిగను రోజుకు ఎన్నిసార్లు తాగవచ్చు? అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
రోజులో ఎప్పుడైనా మజ్జిగను తీసుకోవచ్చు.కానీ ఆహారం తీసుకున్న తర్వాతే మజ్జిగ తీసుకోవడం ఉత్తమం.
భోజనం చేసిన తర్వాత మజ్జిగ తాగితే పొట్టకు చాలా మేలు చేస్తుంది. """/" /
మజ్జిగలో జీర్ణ క్రియను మెరుగుపరిచే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్( Bacteria, Lactic Acid ) ఉంటాయి.
మన జీవ క్రియను ఇది మెరుగుపరుస్తుంది.అందుకే భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగడం చాలా మంచిది.
ఆహారం సరిగ్గా జీర్ణం చేసుకోవడం వలన శక్తిగా మార్చబడుతుంది.అందుకే తిన్న తర్వాత మజ్జిగ తాగితే కడుపులో మంట తగ్గడంతో పాటు ఎసిడిటీ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
ఇక ఎక్కువగా ఆహారం తీసుకున్నట్లయితే తిన్న తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తీసుకుంటే త్వరగా జీర్ణం అయిపోతుంది.
ఇక సాయంత్రం లేదా రాత్రి మజ్జిగ తీసుకోవడం మానుకోవాలి.ఎందుకంటే ఈ సమయంలో మజ్జిగ తీసుకోవడం వలన మీకు జలుబు లాంటి సమస్యలు రావచ్చు.