వింటర్ లో వెయిట్ లాస్ కు సహాయపడే బెస్ట్ టీ ఇది.. అస్సలు మిస్ అవ్వకండి!
TeluguStop.com
ప్రస్తుతం వింటర్ సీజన్( Winter ) నడుస్తున్న సంగతి తెలిసిందే.అయితే చలికాలంలో చాలా మంది వెయిట్ గెయిన్( Weight Gain ) అవుతుంటారు.
ఎందుకంటే చలిపులి కారణంగా ప్రతి ఒక్కరిలోనూ బద్ధకం పీక్స్ లో ఉంటుంది.ఆ బద్ధకం కారణంగా శరీరానికి శ్రమ పెట్టడానికి అస్సలు ఒప్పుకోరు.
నిత్యం వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు.ఫలితంగా శరీర బరువు అదుపు తప్పుతుంది.
కానీ ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ టీ ను వింటర్ సీజన్ లో రెగ్యులర్ గా తీసుకుంటే వెయిట్ గెయిన్ కాదు లాస్ అవుతారు.
మరి ఇంతకీ ఆ టీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.
? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక నిమ్మ పండు ను( Lemon ) తీసుకుని ఉప్పు నీటితో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ లో కట్ చేసి పెట్టుకున్న నిమ్మ పండు ముక్కలు, పది ఫ్రెష్ పుదీనా ఆకులు,( Mint Leaves ) ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టి నైట్ అంతా వదిలేయాలి.
మరుసటి రోజు ఉదయాన్నే స్టవ్ ఆన్ చేసి నిమ్మ పండు ముక్కలు, పుదీనా ఆకులు వేసిన గిన్నె పెట్టి మరిగించాలి.
"""/" /
ఐదు నుంచి పది నిమిషాల పాటు హిట్ చేశాక స్టవ్ ఆఫ్ చేసి వాటర్ ను ఫిల్టర్ చేసుకుంటే మన టీ సిద్ధం అవుతుంది.
ఈ లెమన్ పుదీనా టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా ప్రస్తుత ఈ చలికాలంలో రోజుకు ఒకసారి ఈ లెమన్ పుదీనా టీ తాగితే బాడీలో అధిక క్యాలరీలు కరుగుతాయి.
వెయిట్ లాస్( Weight Loss ) అవుతారు.ఈ టీలోని నిమ్మరసం జీర్ణక్రియను మెరుగుపరచడానికి, బాడీని డీటాక్స్ చేయడానికి సహాయపడుతుంది.
"""/" /
అలాగే పుదీనా అతి ఆకలి బాధలను అరికడుతుంది.వింటర్ సీజన్ లో నిత్యం ఈ లెమన్ పుదీనా టీను తాగితే వర్కౌట్స్ ను స్కిప్ చేసిన కూడా వెయిట్ లాస్ అవుతారు.
మరియు ఈ లెమన్ పుదీనా టీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.అందువల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
ఫలితంగా అనేక సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
ఒంట్లో సత్తువ పెంచే జ్యూస్ ఇది.. రోజు ఉదయం తాగితే మీకు తిరుగేలేదు!