డిప్రెషన్‌లో కూరుకుపోయారా? అయితే మీరు పాలను ఇలా తీసుకోవాల్సిందే!
TeluguStop.com
డిప్రెషన్.ఇటీవల రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎందరినో వేధిస్తున్న కామన్ సమస్య ఇది.
ఇష్టమైన వారు దూరం కావడం, కోరుకున్న రంగంలోకి రాణించలేకపోవడం, సన్నిహితుల చేతుల్లో మోసపోవడం, అప్పులు, పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం, ఆరోగ్య సమస్యలు ఇలా రక రకాల కారణాల వల్ల డిప్రెషన్‌లో కూరుకుపోతుంటారు.
అయితే కొందరు దాని నుంచి బయట పడలేక ప్రాణాలను సైతం విడిస్తుంటారు.అంత వరకు వెళ్లకుండా ఉండాలంటే డిప్రెషన్‌ను వదిలించుకోవడం ఎంతో అవసరం.
అయితే అందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పే విధంగా పాలను తీసుకుంటే గనుక చాలా త్వరగా డిప్రెషన్ నుంచి బయట పడొచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం డిప్రెషన్ తగ్గాలంటే పాలను ఎలా తీసుకోవాలో చూసేయండి.ముందుగా నాలుగు వాల్ నట్స్, నాలుగు ఎండు ద్రాక్షలను తీసుకోవాలి.
ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి మెత్తగా నూరుకోవాలి.ఆ తర్వాత స్టవ్‌పై గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ పాలు పోసి హీట్ చేయాలి.
పాలు కాస్త వేడెక్కాక.వాల్ నట్స్, ఎండు ద్రాక్షల మిశ్రమాన్ని వేసి బాగా మరిగించాలి.
చివరిగా ఒక స్పూన్ బెల్లం తురుము వేసి కరిగి పోయాక స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇప్పుడు ఈ పాలను గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి. """/" /
ప్రతి రోజు పైన చెప్పిన విధంగా పాలను తీసుకుంటే డిప్రెషన్ నుంచి సూపర్ ఫాస్ట్‌గా బయటపడతారు.
అలాగే పాలను ఇలా తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన, తలనొప్పి వంటి సమస్యలు దూరం అవుతాయి.
మెదడు పని తీరు చురుగ్గా మారుతుంది.జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది.
నీరసం, అలసట, బలహీనత వంటివి తగ్గు ముఖం పడతాయి.మరియు నిద్రలేమి సమస్య సైతం పరార్ అవుతుంది.