కాఫీ ఎవ‌రెవ‌రు తాగ‌కూడ‌దు..త‌ప్ప‌కుండా తెలుసుకోండి!

ప్ర‌పంచవ్యాప్తంగా చాలా మంది ఇష్టంగా ఇష్ట‌ప‌డి తాగే పానియాల్లో కాఫీ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.

పైగా కాఫీని లిమిట్‌గా తీసుకుంటే ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌క‌పోగా.బోలెడ‌న్ని హెల్త్ బెనిఫిట్స్‌ను పొందొచ్చ‌ని నిపుణులే చెబుతుంటారు.

అయితే ఇది అంద‌రికీ వ‌ర్తించ‌ద‌నే చెప్పాలి.అవును, కాఫీ ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ కొంద‌రు మాత్రం దానిని దూరంగా ఉండాల్సిందే.

మ‌రి ఆ కొంద‌రు ఎవ‌రు.? వారిలో మీరు ఉన్నారో, లేరో.

? లేట్ చేయ‌కుండా చూసేయండి.అధిక ర‌క్త‌పోటు ఉన్న వారు కాఫీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ర‌క్త పోటు స్థాయిల‌ను పెంచే గుణాలు కాఫీకి ఉంటాయి.అందు వ‌ల్ల‌, హై బీపీ బాధితులు కాఫీ తీసుకుంటే అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

"""/"/ మైగ్రేన్ త‌ల నొప్పితో ఇబ్బంది ప‌డే వారు కూడా కాఫీని తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది.

కాఫీలో కెఫిన్ ఎక్కువ‌గా ఉంటుంది.అయితే ఈ కెఫిన్ మైగ్రేన్ త‌ల నొప్పిని మ‌రింత తీవ్ర త‌రం చేసేస్తుంది.

ఒత్తిడిగా ఉన్నప్పుడు ఒక క‌ప్పు కాఫీ తాగితే రిలాక్స్ అవుతార‌ని అంద‌రూ భావిస్తారు.

కానీ, ఇది నిజం కాద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఆ స‌మ‌యంలో కాఫీని తీసుకుంటే శరీరంలో కార్టిసోల్ హార్మోన్‌పై అధిక ప్రభావం పడుతుంది.

దాంతో ఒత్తిడి పెరిగి పోతుంద‌ని అంటున్నారు.అలాగే నిద్ర లేమి బాధితులు ఖ‌చ్చితంగా కాఫీకి తీసుకోవ‌డం మానేయాలి.

ఎందుకంటే, కాఫీ ఉండే కెఫిన్ నిద్ర లేమి స‌మ‌స్య‌ను దీర్ఘ‌కాలికంగా మార్చేస్తుంది.దాంతో మీరు నానా ఇబ్బంద‌లు ప‌డాల్సి ఉంటుంది.

"""/"/ గ‌ర్భిణీ స్త్రీలు సైతం కాఫీ జోలికి అస్స‌లు వెల్ల‌రాదు.త‌ల్లి మ‌రియు క‌డుపులోకి శిశువు ఆరోగ్యానికి కాఫీ ఏ మాత్రం మంచిది కాదు.

ఒక్కోసారి గ‌ర్భ‌స్రావానికి కూడా దారితీస్తుంది.ఇక జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో త‌ర‌చూ ఇబ్బంది ప‌డే వారు కూడా కాఫీ తీసుకోక‌పోవ‌డ‌మే మేలు.

జర్మనీ పార్లమెంట్ ఎన్నికల బరిలో భారత సంతతి నేత .. ఎవరీ సిద్ధార్ధ్ ముద్గల్?