డ్రెస్ బ్యాంక్.. ఇక్కడ అన్ని వెడ్డింగ్ డ్రెస్‌లు ఉచితంగా దొరుకును!

పెళ్లి అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.వెడ్డింగ్ డ్రెస్‌ల ధర కూడా చాలా అధికంగానే ఉంటుంది.

అయితే కేవలం ఒకేరోజు మాత్రమే వాడే ఈ దుస్తులను అధిక ధర పెట్టి పేదవాళ్లు కొనుగోలు చేయలేరు.

కానీ తమ వెడ్డింగ్ డే సందర్భంగా చాలా ఆకర్షణీయంగా కనిపించాలనుకుంటారు.అలాంటి వారి కోసమే తాజాగా డ్రెస్ బ్యాంకును కేరళలోని ఎరట్టుపేటకు చెందిన యువకులు ప్రారంభించారు.

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన వారు పెళ్లి దుస్తులను ఉచితంగా అందించడానికి 'డ్రెస్ బ్యాంక్' ప్రారంభించారు.

దాదాపు 10 మంది యువకులు ఓకే ఐడియాతో ఈ బ్యాంక్ సృష్టించారు.వీరంతా వాట్సాప్ గ్రూప్ ద్వారా కమ్యూనికేట్ అయ్యి దీనిని విస్తరిస్తున్నారు.

ఇప్పుడు ఈ బ్యాంక్‌ను నిర్వహించేందుకు దాదాపు 250 మంది సభ్యులను ఒకటయ్యారు.పేద కుటుంబాలకు చెందిన వధూవరులు వారి ప్రత్యేక రోజును కోరుకున్న విధంగా గుర్తుండిపోయేలా చేయడంలో సహాయపడాలని వీరందరూ లక్ష్యంగా పెట్టుకున్నారు.

"""/"/ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేసిన ఈ యువకులు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ ప్రోగ్రామ్ వివరాలను పంచుకున్నారు.

కాగా అద్భుతమైన స్పందన వచ్చింది.ఒక నెలలో మలప్పురం, వాయనాడ్, త్రిస్సూర్, ఎర్నాకుళం, ఇడుక్కి సహా వివిధ జిల్లాల నుండి ప్రజలు వివాహ దుస్తులను విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

ఇప్పటి వరకు దాదాపు 300 సెట్ల డ్రెస్‌లు ఫ్రీగా ఇచ్చారు.కాగా 'డ్రెస్ బ్యాంక్' ఇప్పటివరకు 25 కుటుంబాలకు సహాయం చేసింది.

డ్రెస్ బ్యాంకు నుంచి వధూవరులు నాలుగు డ్రెస్సులనైనా తీసుకెళ్లొచ్చు.కావాలంటే వాటిని రిటర్న్ ఇవ్వచ్చు లేదా శాశ్వతంగా ఉంచుకోవచ్చు.

దుస్తులు విరాళంగా ఇవ్వాలనుకునే వారు 9495574524, 9074819858 నంబర్స్‌కి సంప్రదించవచ్చు.

శనగ పంటలో పోషక ఎరువుల యాజమాన్యం.. పంట విత్తుకునే విధానం..!