‘ద్రౌపథి’ చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల

చతురశ్రీ సమర్పణలో శ్రీశ్రీశ్రీ మహమ్మాయి ప్రొడక్షన్స్, శ్రీ సంతోషి మా క్రియేషన్స్ బ్యానర్లపై ‘తిన్నామా పడుకున్నామా తెల్లారిందా!’ చిత్ర ఫేమ్ రామ్ కుమార్ దర్శకత్వంలో బొడ్డుపల్లి బ్రహ్మచార్య నిర్మిస్తోన్న చిత్రం ‘ద్రౌపథి’.

‘నాకు కూడా ఐదుగురే’ అనేది ట్యాగ్‌లైన్.ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్‌ని సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ట్రైలర్‌ను విడుదల చేయగా.

చిత్రయూనిట్ మరియు ఇంకా హాజరైన అతిథులు సంయుక్తంగా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి నటి అక్సాఖాన్, నటుడు రాజేంద్ర, విజయానంద్, సైదా చారి, వెంకట్, సీతారాం, వినయ్, సిరికొండ, ఆరూష్, మోక్షిత తదితరులు హాజరై.

సినిమా ఘన విజయం సాధించాలని కోరారు.ఈ సందర్భంగా నిర్మాత బొడ్డుపల్లి బ్రహ్మచార్య మాట్లాడుతూ.

‘‘వినూత్నమైన కథాంశంతో దర్శకుడు రామ్‌కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేదిగా ఈ చిత్రం ఉంటుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చి, మమ్మల్ని ఆశీర్వదించిన ప్రసన్నకుమార్ గారికి, ఇతర అతిథులకు ధన్యవాదాలు.

ఫస్ట్ లుక్, ట్రైలర్ అందరినీ అలరిస్తాయని భావిస్తున్నాను.అలాగే సినిమా కూడా ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది.

త్వరలోనే ఇతర వివరాలను తెలియజేస్తాము.’’ అని తెలిపారు.

దర్శకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ.‘‘ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు.

ఈ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించిన పెద్దలందరికీ ధన్యవాదాలు.‘ద్రౌపథి’ చిత్ర విషయానికి వస్తే.

మంచి ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్లు కుదిరారు.సినిమా చాలా బాగా వచ్చింది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.త్వరలోనే విడుదల ఉంటుంది.

సహకరించిన అందరికీ ధన్యవాదాలు.’’ అని తెలిపారు.

సాక్షి, రాజేంద్ర, దేవిశ్రీ, శ్రావణ సంధ్య, కట్ట శివ, శ్రీనివాసాచారి, అజయ్ కుమార్.

తదితరులు నటించిన ఈ చిత్రానికి డైలాగ్స్: అశోక్ వడ్లమూడి, డ్యాన్స్: ఉమా శంకర్, సినిమాటోగ్రఫీ: డి.

యాదగిరి, ఎటిటర్: నాగిరెడ్డి.వి.

,మ్యూజిక్: జయసూర్య బొంపెం, రవి ములకలపల్లి, కథ: రామ్ కుమార్, అశోక్ వడ్లమూడి ,సహనిర్మాతలు: బొడ్డుపల్లి సంతోష్, సంపత్, సంకీర్త్ పీఆర్వో: బి.

వీరబాబు, నిర్మాత: బొడ్డుపల్లి బ్రహ్మచార్య, కథనం మరియు దర్శకత్వం: రామ్ కుమార్.