ద్రౌపది కోసం ప్రత్యేక ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా?

సాధారణంగా మనదేశంలో ఎక్కడికి వెళ్ళిన మనకు దుర్గామాత, శివుని ఆలయాలు, విష్ణు దేవాలయాలు ఎక్కువగా దర్శనమిస్తుంటాయి.

ఆ దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి అనుగ్రహం పొందుతుంటారు.కానీ మీరు ఎప్పుడైనా ద్రౌపది కోసం ఆలయాలు నిర్మించారని మీకు తెలుసా? పాండవులను వివాహమాడిన ద్రౌపదికి ఆలయాన్ని నిర్మించి, భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.

అయితే మనదేశంలో ఈ ద్రౌపది ఆలయాలు ఎక్కడ ఉన్నాయో? ఆ ఆలయం యొక్క విశిష్టత ఏమిటో? ఇక్కడ తెలుసుకుందాం.

"""/"/ బెంగళూరులోని ఎంతో ప్రసిద్ధి చెందిన ధర్మదాయ దేవాలయం ఉంది.ఈ ఆలయంలో పాండవులు, ద్రౌపదికి భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు.

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కరగ పండుగ పేరిట పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతారు.

ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తారు.

"""/"/ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో యమిగాని పల్లెల్లో ధర్మరాజుకు దేవాలయం ఉంది.

ఈ దేవాలయంలోనే ద్రౌపదినీ కూడా పూజిస్తారు.పుత్తూరు సమీపంలోని ఒక గ్రామంలో ఆరుగురు అన్నదమ్ములు కలిసి ఒక బావిని తవ్వుతుండగా ఈ విగ్రహం బయట పడినట్లు పురాణాలు చెబుతున్నాయి.

అయితే ఆరుగురిలో చిన్నవాడైన చినతంబికి ద్రౌపది కలలో కనిపించి వారికి ఆలయం నిర్మించాలని కోరారు.

ఈ విధంగా విరాళాలను సేకరించి ఆలయాన్ని నిర్మించారు.ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ ఆలయంలో 18 రోజుల పాటు ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

అప్పట్లో బ్రిటిష్ వారు కూడా ఈ ఆలయాన్ని సందర్శించినట్లు చరిత్ర చెబుతోంది.ఈ ఆలయంలో సంతానం లేని వారు ప్రత్యేక పూజలను చేయడం ద్వారా వారికి తొందరగా సంతానం కలుగుతుందని ప్రగాఢ నమ్మకం.

అందుకే ఈ ప్రాంతంలో ద్రౌపది దేవిని సంతానలక్ష్మి గా పూజిస్తారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే3, శుక్రవారం 2024