వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో నత్తనడకన కొనసాగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులు!
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ సుందరికరణ పనుల్లో భాగంగా రహదారి ఇరువైపులా డ్రైనేజీ తో పాటు ఫుట్పాత్ నిర్మాణ పనులు నత్త నడకన కొనసాగుతుండడంపై ఇటు షాపుల వ్యాపారులు, అటు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు.
డ్రైనేజీ నిర్మాణ పనుల ద్వారా నడిచేటప్పుడు గుంతలో పడి కొన్ని సందర్భాల్లో గాయాల పాలవుతున్నామని ఇప్పటికైనా సంబంధిత అధికారులు డ్రైనేజీ నిర్మాణ పనులను వెంటనే శరవేగంగా పూర్తి చేయాలని వేడుకుంటున్నారు.
బలగం వేణుకి హీరో దొరికాడా..? నాని హ్యాండ్ ఇచ్చిన కూడా ఆ కుర్ర హీరోను సెట్ చేశాడా..?