డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసే విధానం.. సస్యరక్షక పద్ధతులు..!

వ్యవసాయ రంగంలో కొత్త పంటలు సాగు చేసి అధిక దిగుబడి సాధించాలని చాలామంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.

కానీ కొందరు మాత్రం సరైన అవగాహన లేక అధిక దిగుబడి సాధించడంలో విఫలం అవుతున్నారు.

కొత్త పంటల దృష్ట్యా అవగాహన కల్పించుకుంటే మంచి ఆదాయం అర్జించవచ్చు.ఈ మధ్యకాలంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు ద్వారా కొంతమంది రైతులు అధిక దిగుబడి సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

డ్రాగన్ ఫ్రూట్( Dragon Fruit ) ఒక్కసారి నాటితే దాదాపుగా 20 ఏళ్ల పాటు దిగుబడి పొందవచ్చు.

కానీ పెట్టుబడి కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది.మొక్కలు, ఎరువులు, పోల్స్, డ్రిప్, కూలీ ఖర్చులు లాంటివి అన్నీ కలిపితే ఎకరాకు సుమారుగా రూ.

6 లక్షల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది.ఉష్ణోగ్రత 30 డిగ్రీల కంటే తక్కువగా ఉండి, నేల పిహెచ్ విలువ 5.

5 నుంచి 7 వరకు ఉండే నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.డ్రాగన్ ఫ్రూట్ ఔషధాలతో కూడుకున్నది కాబట్టి మార్కెట్లో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది.

"""/" / ఇక ఎరువుల విషయానికి వస్తే.ఎక్కువ ప్రాధాన్యత సేంద్రీయ ఎరువులకే ఇవ్వాలి.

సేంద్రియ ఎరువుల( Organic Fertilizers ) ద్వారా నాణ్యమైన దిగుబడి పొందవచ్చు.పైగా ఈ పంట సాగుకు చీడపీడల బెడద చాలా తక్కువ.

పంట సాగు చేస్తున్నప్పుడు ఎకరాకు నాలుగు టన్నుల ఎరువులు అందించాలి.ఒక ఎకరాకు దాదాపుగా నాలుగు టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు.

ఇంకా రెండో సంవత్సరం నుండి దిగుబడి ఇంకా పెరిగే అవకాశం ఉంది.ఒక ఎకరాకు 500 సిమెంట్ పోల్స్ అవసరం.

వీటిని 10 * 7 అడుగుల దూరంలో నాటుకోవాలి.ప్రతి సిమెంట్ పోల్ కు రౌండ్ సిమెంట్ బిళ్ళను అమర్చుకోవాలి.

కొంతమంది రైతులు టైర్లను అమరుస్తున్నారు వీటివల్ల వేడి ఎక్కువగా తాకడంతో కాయ,కాండం కుళ్లే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఒక్కో పోల్ కు నాలుగు మొక్కలు నాటుకొని అవి వాలిపోకుండా తీగలు లేదా ట్యూబ్ తో గట్టిగా కట్టాలి.

నీరు నిల్వ ఉండని సారవంత నేలలు, ఇసుక నేలలు( Sandy Soils ) చాలా అనుకూలంగా ఉంటాయి.

భూమిలోని నేల శాతాన్ని బట్టి 15 రోజులకు ఒకసారి విధానం ద్వారా నీటిని అందించాలి.

ఒక ఎకరం భూమిలో దాదాపుగా రెండు వేల వరకు మొక్కలు నాటుకోవాలి.ఒక చెట్టు నుండి దాదాపు 40 పండ్ల దిగుబడి పొందవచ్చు.

ఇక ఒక్కో పండు దాదాపుగా 400 గ్రాములు ఉంటుంది.

సజ్జలకే మళ్లీ పెద్ద పీట ! జగన్ నమ్మకం పై చర్చ