పల్నాడు జిల్లాలో 200 పడకల గల డాక్టర్ వైయస్సార్ ఆసుపత్రి ని ప్రారంభించిన మంత్రి విడుదల రజిని

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని లింగంగుంట్ల ల ఏర్పాటుచేసిన డాక్టర్ వైయస్సార్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 200 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కలెక్టర్ శివ శంకర్ మరియు ఎస్పీ రవిశంకర్ రెడ్డి.

ఈ సందర్భంగా వైద్య వైద్యారోగ్య శాఖ మంత్రి రజిని మాట్లాడుతూ వైద్య శాఖలోని ఆసుపత్రులు రూపురేఖలు మారుతున్నాయని సీఎం జగన్ ఆరోగ్య శాఖలో విప్లమాత్మకమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు వికేంద్రీకరణ పద్ధతిలో ఆసుపత్రులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని పూర్తిస్థాయి సిబ్బందిని త్వరలోనే నియమిస్తామని రజిని వెల్లడించారు.

చంద్రబాబు వైద్య ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేశారని సెల్ఫోన్ లైట్లలో ఆపరేషన్లు చేసే వారిని రజిని ఎద్దేవా చేశారు అమరావతి రైతుల పాదయాత్రకు కర్త కర్మ చంద్రబాబునాని విమర్శించారు హైకోర్టు వద్ద 600 మందికి పాదయాత్రకు అనుమతి తీసుకుంటే కేవలం 60 మంది మాత్రమే రాజధాని పాదయాత్రలో ఉన్నారన్నారు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే పాదయాత్ర జరుగుతుందని కానీ ఇప్పుడు ఆ పాదయాత్ర ఆగిపోయినట్లేనని మంత్రి రజిని తెలిపారు.

అదేవిధంగా తెనాలి ఆసుపత్రిలో ప్లాస్టిక్ వేలిముద్రలతో హాజరు వేసిన ఘటనపై శాఖ పరమైన విచారణకు ఆదేశించారు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి రజిని తెలిపారు.

తారా స్థాయికి చేరిన మంచు ఫ్యామిలీ గొడవలు… లక్ష్మి ప్రసన్న పోస్ట్ వైరల్!