తెలుగు ప్రజల గుండెల్లో మానవతా స్ఫూర్తిదాతగా ‘డా.వైఎస్ఆర్’

డాక్టర్.వైఎస్ రాజశేఖర్ రెడ్డి.

ఈ పేరు సంక్షేమానికి సంతకం, అభివృద్ధికి నిర్వచనం, ప్రజా హృదయాల్లో ఆశాదీపం, నేనున్నానంటూ ఆపన్నఆస్తం అందించిన వ్యక్తిగా పేరు, అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో వెలుగు దివ్వె.

అందుకే వైఎస్ఆర్ అంటే ఇప్పటికీ ఓ ప్రభంజనమే అని చెప్పొచ్చు.ప్రజల మనస్సుల్లో శాశ్వత జ్ఞాపకంగా నిలిచిన దివంగత నేత వైఎస్ఆర్.

ఒకప్పుడు నేతలంటే కేవలం రాజకీయాలకే పరిమితం.కానీ వైఎస్ఆర్ వచ్చాక రాజకీయానికి, నాయకత్వానికి సరికొత్త నిర్వచనం చెప్పారు.

పాలిటిక్స్ వేరు.లీడర్ షిప్ అని నిరూపించిన ఆయన.

పాలనలో నూతన ఒరవడిని సృష్టించారు.గతంలో ఎన్నికలు వస్తేనే రాజకీయ నాయకులు కనిపించేవారు.

ప్రజలు ఏమైనా పట్టించుకునే వారు కాదు.పేరుకే ప్రభుత్వాలు నడిచేవి.

అలాంటి దుర్భర పరిస్థితుల్లో పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకున్న మహా నేతగా వైఎస్ఆర్ ఖ్యాతిగాంచారు.

తరువాత ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించిన ఆయన తను గమనించిన ప్రతి సమస్యను పరిష్కరించారు.

దాంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ సంక్షేమ సారథిగా, అభివృద్ధికి వారధిగా నిలిచారు.

అంతేకాదు కష్టాలతో యుద్ధం చేసే నిరుపేదల పక్షాన అలు పెరగని పోరాటం చేశారు.

పార్టీ కోసమే కాకుండా ప్రజల కోసమే ప్రభుత్వం పనిచేయాలన్న లీడర్.పార్టీ ఇచ్చే ఎజెండాను వ్యతిరేకించి ప్రజా సమస్యలను తీర్చడమే అసలైన ఎజెండా అని చాటి చెప్పారు.

నవ సమాజ స్థాపనకు ఆయన అడుగులే ఆరంభంగా నిలిచాయి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తగా ప్రతి కుటుంబంలో ఓ సభ్యుడిగా చెరగని ముద్ర వేశారు.

ప్రస్తుతం ఆయన లేకపోయినా ఆయన కీర్తి అజరామరం.వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.

పేదల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు.అందులో ప్రధానమైనవి.

- నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ‘ఆరోగ్య శ్రీ’ పథకాన్ని తీసుకువచ్చారు.

- డబ్బులు లేక చదువులు ఆగిపోకూడదనే లక్ష్యంతో ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయం అందించేందుకు గానూ ‘ఫీజు రీయింబర్స్ మెంట్’ ను ప్రవేశపెట్టారు.

- రైతు సంక్షేమమే ధ్యేయంగా పంట పొలాలకు సాగునీరు అందించాలని ‘జలయజ్ఞం’ ను ప్రారంభించిన ఘనత వైఎస్ఆర్ కే దక్కుతుంది.

లక్షల ఎకరాలకు సాగునీరు అందించి రాష్ట్రంలో సిరులు పండించేందుకు శ్రీకారం చుట్టిన మహానేతగా అన్నదాతల హృదయాలలో నిలిచారు.

అంతేకాకుండా రైతులకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు.

పేదరికం కారణంగా ఎవరూ బాధపడకూడదని సంక్షేమ వరాలు కురిపించిన వైఎస్ఆర్ అనుకోకుండా అందరికీ అందనంతా దూరానికి వెళ్లిపోయారు.

అయినప్పటికీ ప్రతి ఒక్కరి మదిలో చిరస్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు రాజన్న.

అందుకే వైఎస్ పాలన మళ్లీ వస్తే బావుండు అని భావిస్తారు ప్రజలు.ఆ నమ్మకం, భరోసాకు ఊపిరిపోస్తూ.

వైఎస్ఆర్ ఆశయాలు, ఆలోచనలు అంతటితో ఆగిపోకూడదని ఆయన తనయుడు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రతి పేదవాని ఇంటిలో సంతోషాలు నింపే బాధ్యతను చేపట్టారు.

తండ్రికి తగ్గ తనయుడిగా రాజన్న రాజ్యాన్ని కొనసాగిస్తున్నారు.

సమాధులు తవ్వి ఆడ శవాలపై అత్యాచారాలు చేస్తున్న పాక్ వ్యక్తి.. కట్ చేస్తే..?