ఇల్లినాయిస్ : ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా తెలుగు వైద్యుడు

ఇండియన్ అమెరికన్ న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) మాజీ అధ్యక్షుడు డాక్టర్ సురేశ్ రెడ్డి మరో కీలక బాధ్యతలు చేపట్టారు.

ఇల్లినాయిస్‌లోని ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సురేశ్ రెడ్డి పగ్గాలు అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో చికాగోలోని భారత కాన్సుల్ జనరల్ అమిత్ కుమార్, యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, ఇల్లినాయిస్ రాష్ట్ర ప్రతినిధి డీన్నే మజ్జోచి, ఏఏపీఐ మాజీ అధ్యక్షుడు డాక్టర్ రంగారెడ్డి, ఏఏపీఐ కార్యదర్శి డాక్టర్ సతీశ్ కతుల తదితరులు హాజరయ్యారు.

డాక్టర్ సురేశ్ రెడ్డి బెత్ ఇజ్రాయెల్ డీకనెస్ మెడికల్ సెంటర్, హార్వర్డ్ మెడికల్ స్కూల్.

బోస్టన్, మసాచుసెట్స్‌లోని న్యూరో రేడియాలజీ, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజీలో చదువుకున్నారు.

అనంతరం బెత్ ఇజ్రాయెల్ డీకనెస్ మెడికల్ సెంటర్‌లో ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజీకి చీఫ్‌గా వ్యవహరించారు.

అలాగే ఒక దశాబ్ధం పాటు హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఫ్యాకల్టీగా పనిచేశాడు.మెదడులోని అనూరిజమ్స్, స్ట్రోక్‌లకు చికిత్స చేసే అత్యంత ప్రత్యేకమైన పద్ధతులపై సురేశ్ రెడ్డి పనిచేస్తున్నారు.

అలాగే వెన్నెముకలోని అత్యంత క్లిష్టమైన ప్రాంతాలలో చికిత్సకు సంబంధించి శిక్షణ తీసుకున్నారు.వైద్య రంగంలో తన పరిశోధనలకు సంబంధించి అనేక అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్‌ను ప్రచురించడంతో పాటు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు.

"""/"/ దీనితో పాటు ఎంతోమంది వైద్య విద్యార్ధులకు బోధనలు చేశారు.వైద్య రంగంలో చేసిన కృషికి గాను సురేశ్ రెడ్డి ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు.

హార్వర్డ్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా వున్న సమయంలో “Faculty Award For Excellence In Teaching” అవార్డ్‌ను నాలుగు సార్లు అందుకున్నారు.

అమెరికాకు వలస వెళ్లడానికి ముందు కాకతీయ, ఉస్మానియా మెడికల్ కాలేజీలలో సురేశ్ రెడ్డి తన వైద్య విద్యను పూర్తి చేశారు.

ఆయన ప్రస్తుతం హైన్స్ మెడికల్ సెంటర్‌లో రేడియాలజీకి చీఫ్‌గా, చికాగోలోని లయోలా మెడికల్ సెంటర్‌లో రేడియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

ఆయన భార్య లీల, కుమారుడు రోహున్‌తో కలిసి చికాగోలో నివసిస్తున్నారు.

26వ రోజు కొనసాగుతున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం..