డాక్టర్ కొలకళపూడి శ్రీనివాస్ చేపట్టిన కృతజ్ఞత యాత్ర కు చింతల పాలెం లో ఘనస్వాగతం పలికిన మాలేపాటి సుబ్బానాయుడు

అమరావతి రాజధాని పరిరక్షణ సమితి అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం నుండి దేవస్థానం పాదయాత్రకు బ్రహ్మరథం పట్టిన గ్రామ గ్రామానికి ప్రతి కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేసె మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టింది.

గత 12 రోజులుగా అమరావతి రాజధాని పరిరక్షణ సమితి అమరావతి జేఏసీ కన్వీనర్ డాక్టర్ కొలకళపూడి శ్రీనివాస్ చేపట్టిన కృతజ్ఞత యాత్ర నేటి ఉదయం నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం రాజువారి చింతల పాలెం చేరుకున్నది.

కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాలేపాటి సుబ్బానాయుడు రాజువారి చింతల పాలెం వద్ద అమరావతి జేఏసీ బృందానికి ఘన స్వాగతం పలికారు.

కొత్తపల్లి గ్రామంలోని ప్రజలు డాక్టర్ శ్రీనివాస్ పై పూల వర్షం కురిపిస్తూ బాణాసంచాలు పేలుస్తూ డప్పు కళాకారుల నడుమ ఘనంగా స్వాగతం పలికారు.

గ్రామ ప్రజల నుండి వచ్చిన విశేష స్పందన చూసి డాక్టర్ డప్పు కొట్టి ప్రజలను ఉత్తేజపరిచారు.

ఈ సందర్భంగా డాక్టర్ కొలకళపూడి శ్రీనివాస్ స్థానిక ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ కొలకళపూడి పాత్రికేయులతో మాట్లాడుతూ.ప్రభుత్వం ఇకనైనా అమరావతిని ప్రజా రాజధానిగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

అభివృద్ధి వికేంద్రీకరణతో పై దృష్టి సారించాలి తప్ప పాలనా వికేంద్రీకరణ తో ఉపయోగం లేదని హితవు పలికారు.

ప్రభుత్వం ఇకనైనా కోర్టు తీర్పు ని గౌరవించి అమరావతి అభివృద్ధి చేసి పెట్టుబడులు ఆకర్షించే విధంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ ఇన్చార్జి మాలేపాటి సుబ్బానాయుడు రాజువారి చింతలపాలెం కొత్తపల్లి ప్రజలు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వైరల్ : అయ్యబాబోయ్.. 3 రోజుల్లో 60 మందిని పెళ్లాడిన మహిళ..