ఆర్ఎస్ఎస్ భావజాలంతో ప్రస్తుతం దేశాన్ని బీజేపీ పార్టీ పరిపాలిస్తుంది.ఇక బీజేపీ పార్టీలో ఉన్న నేతలందరూ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినవారే కావడం విశేషం.
హిందుత్వ బావజాలంతో నడిచే ఆర్ఎస్ఎస్ ని వ్యతిరేకించే వారు చాలా మంది ఉన్నారు.
బీజేపీ వ్యతిరేక పార్టీలు, సెక్యులర్ భావజాలం ఉన్నవారు చాలా మంది ఆర్ఎస్ఎస్ అంటే విపరీతమైన ద్వేషం చూపిస్తూ ఉంటారు.
బీజేపీ వారిని మనువాదులుగా చిత్రీకరిస్తూ, మరల ఒకప్పటి హిందుత్వ పోకడలని తీసుకురావడానికి ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తుందని ప్రచారం చేస్తూ ఉంటారు.
ఇదిలా ఉంటే తాజాగా అంబేద్కర్ ముని మనవడు రాజారత్న అంబేద్కర్ కూడా ఆర్ఎస్ఎస్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మొదటి నుంచి హిందుత్వ వ్యతిరేకిగా ఉండే రాజారత్న ఈ మధ్య కాలంలో ప్రముఖంగా కనిపిస్తున్నారు.
కర్ణాటకలో జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ పాకిస్థాన్‌లో నేను గతంలో ఇచ్చిన సందేశం మీరంతా చూడాలి.
ఆర్ఎస్ఎస్ ఓ ఉగ్రవాద సంస్థ అని నేను అక్కడ చెప్పా.దీన్ని సంబంధించి నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి.
ఈ సంస్థను పూర్తిగా నిషేధించాలి అని అన్నారు.ప్రధాని పక్కన కనిపించే ఓ సాధ్వి ప్రజ్ఞా సింగ్ గతంలో మాట్లాడుతూ ఆర్మీ దగ్గర పూర్తిగా ఆయుధాలు అయిపోతే ఆరెస్సెస్ అందజేసిందని రాజరాత్న చెప్పారు.
బాంబులు, తుపాకీలు లాంటివి పోలీసులు రికవరీ చేస్తే ఆ ఇంటిని, అందులోని మనుషుల్ని టెర్రరిస్టులని కాకుండా మరేమనాలని ప్రశ్నించారు.
ఒక సంస్థ దగ్గర ఇవి ఉంటే ఉగ్రవాద సంస్థ అని అనకూడదా అని అన్నారు.
రాజారత్న వ్యాఖ్యలపై ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు, నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.